అక్షరటుడే, అమరావతి: Raheja investment in visakhapatnam | విశాఖపట్నంలో ప్రముఖ నిర్మాణ దిగ్గజం కె. రహేజా కార్పొరేషన్ ఐటీ కంపెనీల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.2,172.26 కోట్లతో వాణిజ్య, నివాస భవనాల నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం సంస్థ మధురవాడ ఐటీ హిల్‌లో 27.10 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది.
విశాఖపట్నం Vishakapatnam ఐటీ రంగంలో మరో కీలక అడుగు పడనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కె. రహేజా కార్పొరేషన్ నగరంలో భారీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఐటీ కంపెనీల అవసరాలకు తగిన వాణిజ్య, నివాస భవనాల నిర్మాణం కోసం రూ.2,172.26 కోట్ల పెట్టుబడిని పెట్టబోతున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఈ ప్రాజెక్ట్ కోసం రహేజా గ్రూప్ మధురవాడ ఐటీ హిల్ నంబర్-3లో 27.10 ఎకరాల భూమిని ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత దాదాపు 9,681 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని సంస్థ తెలిపింది.
Raheja investment in visakhapatnam | రెండు దశల్లో నిర్మాణం
రహేజా Raheja కార్పొరేషన్ ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టనుంది. మొదటి దశ: 2028 నాటికి వాణిజ్య భవనాలు పూర్తవుతాయి. ఇందుకోసం రూ.663.42 కోట్లు వెచ్చించి, .59 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని అభివృద్ధి చేయనున్నారు.
రెండో దశలో 2031 నాటికి వాణిజ్య భవనాలు, 2035 నాటికి నివాస సముదాయాలు పూర్తవుతాయి. దీనికి రూ.1,418.84 కోట్లు ఖర్చు చేసి, 19.06 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు జరగనున్నాయి.
ఇటీవలే గూగుల్ సంస్థ విశాఖలో ఏఐ డేటా సెంటర్ AI Data Centre ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే మిలీనియం టవర్స్ లో కార్యాలయాలు ప్రారంభించాయి.
కొత్తగా రాబోయే కంపెనీలకు అవసరమైన ఆఫీస్ స్పేస్‌ను అందించేందుకు ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు చురుకుగా ముందుకు వస్తున్నాయి. రహేజా సంస్థ 2028 నాటికి వాణిజ్య నిర్మాణాలను, 2030 నాటికి నివాస సముదాయాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత విశాఖపట్నం ఐటీ IT రంగం మరింత వేగంగా ఎదగనుందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తంగా, ఈ ప్రాజెక్టుతో Project విశాఖ ఐటీ సిటీగా మారే దిశలో మరో కీలక అడుగు పడనుంది.