HomeజాతీయంCBI Arrest | సీబీఐకి చిక్కిన పంజాబ్​ డీఐజీ.. ఆస్తులు చూసి షాకైన అధికారులు

CBI Arrest | సీబీఐకి చిక్కిన పంజాబ్​ డీఐజీ.. ఆస్తులు చూసి షాకైన అధికారులు

పంజాబ్​లోని రోపార్ రేంజ్ డీఐజీ హర్‌చరణ్ సింగ్ భుల్లర్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్​ చేశారు. అతని ఇంట్లో సోదాలు చేపట్టి భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Arrest | సీబీఐ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. పంజాబ్​లోని
రోపార్ రేంజ్ డీఐజీ హర్‌చరణ్ సింగ్ భుల్లర్‌ను లంచం తీసుకుంటుండగా.. సీబీఐ అధికారులు (CBI Officers) రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

అనంతరం గురువారం ఆయన ఇళ్లలో సోదాలు చేపట్టగా.. భారీగా అక్రమాస్తులు గుర్తించారు.
పంజాబ్​లోని 2009 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి (IPS Officer) భుల్లర్ రూ.8 లక్షల లంచం తీసుకుంటుండగా.. సీబీఐ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఓ స్క్రాప్​ డీలర్​ను ఆయన లంచం ఇవ్వాలని వేధించగా.. సీబీఐకి సమాచారం అందించారు. దీంతో సీబీఐ వల పన్ని సదరు అవినీతి అధికారిని పట్టుకుంది. అనంతరం రోపార్, మోహాలీ, చండీగఢ్‌లో డీఐజీకి చెందిన నివాసాల్లో సీబీఐ అధికారులు సోదాలు (CBI Raids) చేపట్టారు.

CBI Arrest | భారీగా నోట్ల కట్టలు

డీఐజీ భుల్లార్​ అక్రమాస్తులు చూసి సీబీఐ అధికారులే షాక్​ అయ్యారు. ఆయన ఇంట్లో భారీగా నోట్ల కట్టలు లభించాయి. రూ. 5 కోట్ల నగదుతో పాటు 1.5 కేజీల బంగారం, 22 ఖరీదైన రిస్ట్ వాచులు స్వాధీనం చేసుకున్నారు. మెర్సిడీజ్, ఆడీ కార్లు, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న 40 లీటర్ల మద్యం, ఆయుధాలు స్వాధీనం సైతం సీజ్​ చేశారు. కాగా భుల్లర్​కు మధ్యవర్తిగా వహించిన కృష్ణ ఇంట్లో సైతం అధికారులు సోదాలు చేపట్టి రూ.21 లక్షల నగదు పట్టుకున్నారు. నిందితులను శుక్రవారం కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.