HomeతెలంగాణNandipet | విద్యార్థుల కళ్లలో కారం పోసి.. చితకబాదిన సైకో టీచర్​

Nandipet | విద్యార్థుల కళ్లలో కారం పోసి.. చితకబాదిన సైకో టీచర్​

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్​ : Nandipet | పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు సైకోలా వ్యవహరించాడు. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన ఆయన క్రమశిక్షణ తప్పాడు. చిన్నారులను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ ఘటన నందిపేట మండలంలో చోటు చేసుకుంది.

నందిపేట (Nandipet) మండలం కుద్వాన్​పూర్​ ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు (Govt Teacher) విచక్షణరహితంగా వ్యవహరించారు. చిన్నారులని కూడా చూడకుండా కంట్లో కారం కొట్టి చిత్రహింసాలు పెట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పాఠశాలలోని రెండు, మూడో తరగతి చదువుతున్న 10 మంది విద్యార్థులను సదరు ఉపాధ్యాయుడు ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. అల్లరి చేస్తున్నారనే కారణంతో వారిని కొట్టడంతో పాటు కంట్లో కారం పోశాడు. ఇటీవల ఈ ఘటన జరగ్గా మరుసటి రోజు నుంచి ఆయన బడికి రావడం మానేశాడు.

Nandipet | తల్లిదండ్రులు రావడంతో..

పిల్లలను కొట్టిన తర్వాత బడికి రావడం మానేసిన ఉపాధ్యాయులు శనివారం తిరిగి హాజరు అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని అతడిపై దాడికి యత్నించారు. దీంతో సదరు ఉపాధ్యాయుడు పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎంఈవో పాఠశాలకు చేరుకొని వివరాలు సేకరించారు.

Nandipet | ఎంఈవో విచారణ

పాఠశాలలో విద్యార్థుల కళ్లల్లో కారం కొట్టి చితకబాదిన ఘటనపై నందిపేట ఎంఈవో గంగాధర్ (MEO Gangadhar) విచారణ చేపట్టారు. ఈ ఘటనపై విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆయమ్మ నుంచి వివరాలను సేకరించారు. పూర్తి నివేదికను ఉన్నతధికారులకు అందజేయడనున్నట్లు సమాచారం. సదరు టీచర్​పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్​ చేస్తున్నారు. ఇలాంటి ఒకరిద్దరు టీచర్ల తీరుతో ఉపాధ్యాయులకు మచ్చ వస్తుందని పలువురు అంటున్నారు.

Must Read
Related News