అక్షరటుడే, వెబ్‌డెస్క్: Psychiatrists | రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో జాతీయ మహాసభలు నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మానసిక వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా “ఆత్మహత్య లక్షణాలకు నూతన చికిత్సా విధానాలపై” ప్రత్యేక వర్క్‌షాప్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ శాఖ అధ్యక్షుడు, న్యూరోసైకియాట్రిస్ట్ ప్రొఫెసర్ డా. విశాల్ ఆకుల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా. విశాల్ మాట్లాడుతూ.. “మెదడులో ఆనందాన్ని కలిగించే జీవ రసాయనాలైన Serotonin, Dopamine స్థాయిలు తగ్గడం వల్ల డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి. ఈ రసాయనాల స్థాయిలను పెంచే అధునాతన మందులతో చికిత్స చాలా ప్రభావవంతంగా ఉంటుంది” అని వివరించారు.
Serotonin, Dopamine స్థాయిలను పెంపొందించడానికి ఉపయోగించే ఆధునిక మెడికేషన్, అత్యవసర వైద్య పద్ధతులు, తాజా పరిశోధనలను కార్యక్రమంలో వివరించారు.
Psychiatrists | చికిత్సా విధానాలు..
ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా. కిషన్, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సౌత్ జోన్ స్టేట్స్ జనరల్ సెక్రటరీ డా. జార్జ్ రెడ్డి కూడా పాల్గొని ఆత్మహత్యల నివారణకు నూతన చికిత్సా విధానాలపై కీలక సూచనలు చేశారు.
వర్క్‌షాప్‌లో ఆత్మహత్య లక్షణాల నిర్ధారణ, ప్రమాద మూల్యాంకనం, కొత్త మందులు, చికిత్సా విధానాలు, అత్యవసర వైద్య జోక్యాలు, భద్రతా చర్యలు, ఆత్మహత్యలను తగ్గించడంలో తాజా పరిశోధనలపై విస్తృతంగా చర్చించారు.
దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన నిపుణుల నుంచి ఈ సెషన్‌కు విశేషమైన స్పందన లభించింది. ప్రొ. డా. విశాల్ మాట్లాడుతూ, “సమయానుకూల చికిత్స, శాస్త్రీయ ఇంటర్వెన్షన్, అవగాహన పెంచడం ద్వారా ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించవచ్చు” అని వివరించారు.