అక్షరటుడే, ఎల్లారెడ్డి : Mla Madan Mohan | ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) శనివారం హైదరాబాద్‌లో (Hyderabad) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు.
Mla Madan Mohan | నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి..
కాళేశ్వరం 22 ప్యాకేజీ కింద నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) కోరారు. అలాగే పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధి కోసం (బాలురు, బాలికల కోసం మరుగుదొడ్లు, అదనపు తరగతి గదుల నిర్మాణం, ప్రహరీలు, వంటశాల షెడ్ల నిర్మాణం) నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Mla Madan Mohan | కేకేవై రహదారిపై వంతెనల కోసం..
వరద ప్రభావిత ప్రాంతమైన కేకేవై రహదారిపై (KKY Road) హైలెవల్ వంతెనల నిర్మాణానికి నిధులు సమకూర్చాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే గాంధారి, తాడ్వాయి మినీ స్టేడియంల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పోచారం ప్రాజెక్ట్ (Pocharam Project), నాగన్న మెట్లబావి పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం రూ. 5 కోట్లు విడుదల చేయడంపై ఎల్లారెడ్డి నియోజకవర్గ (Yellareddy Constituency) ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
నాగిరెడ్డిపేట మండలం (Nagireddypeta Mandal) మాల్తుమ్మెద గ్రామంలో రూ.15 కోట్ల వ్యయంతో 20,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం నిర్మాణానికి సీఎం నిధులిచ్చారన్నారు. నిజాంసాగర్ బ్యాక్ వాటర్స్ ఫోర్‌షోర్ అడవుల క్లియరెన్స్‌కు రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు, నాగిరెడ్డిపేట తాండూర్‌లోని త్రిలింగ రామేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణకు రూ.77 లక్షల నిధులు మంజూరు చేసినందుకు సీఎంకు ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మరిన్ని అభివృద్ధి పనుల కోసం సమర్పించిన వినతిపత్రంపై సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.