అక్షరటుడే, ఇందూరు: GGH Nizamabad | ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, తద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరుపై వారికి నమ్మకం పెరుగుతుందని రాష్ట్ర మైనారిటీ కమిషన్ (State Minoritie Commission) ఛైర్మన్ తారిఖ్ అన్సారీ (Tariq Ansari) సూచించారు. సోమవారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్య కళాశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీజీహెచ్, మెడికల్ కళాశాల (Medical College) పనితీరు, నిర్వహణకు సంబంధించి సమగ్ర అంశాలను పొందుపరిస్తూ కమిషన్ కార్యాలయానికి నివేదిక పంపాలని సూచించారు. వైద్య విద్యార్థుల శిక్షణలో భాగంగా కమ్యూనిటీ ఆరోగ్య శిబిరాల నిర్వహణపై దృష్టి సారించాలన్నారు.
ఎంతో నమ్మకంతో ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి గౌరవిస్తూ సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని తెలిపారు. అంతకుముందు ఒక్కో విభాగం వారీగా అందిస్తున్న వైద్య సేవలు గురించి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమోహన్, ఆయా విభాగాల హెచ్ఓడీలు, డాక్టర్లు, వైద్య కళాశాల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.