అక్షరటుడే, వెబ్‌డెస్క్: Protests Intensify in Iran | ఇరాన్‌లో చోటుచేసుకున్న నిరసనల్లో దాదాపు 5 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారి ఓ ప్రాంతీయ తెలిపినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం ప్రచురించింది. మరణించిన వారిలో 500 మంది వరకు భద్రతా సిబ్బంది ఉన్నారని వెల్లడించింది. ఈ చావులకు “ఉగ్రవాదులు, ఆయుధాలు ధరించిన అల్లరిమూకలు” కారణమన్నారు. వారే ఇరానీయులను చంపారని ఆరోపించారు.
Protests Intensify in Iran | ఆర్థిక సంక్షోభమే కారణం
గతేడాది డిసెంబరు 28 వ తేదీ నుంచి ఇరాన్‌లో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి. మొదట ఆర్థిక సంక్షోభంపై కొనసాగించిన నిరసనలు క్రమంగా మతాధిపత్య పాలనపై తిరుగుబాటుగా మారింది. 1979లో తొలిసారి ఇస్లామిక్ విప్లవం చోటుచేసుకుంది. ఆ తర్వాత ఇరాన్‌లో జరిగిన అత్యంత రక్తపాత ఘటన తాజాగా జరుగుతున్నదే కావడం గమనార్హం.
Protests Intensify in Iran | ట్రంప్ వర్సెస్ ఖామెనై
ఇరాన్‌లో ఆందోళనకారులపై హింస పెరిగితే తాము జోక్యం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. తాజాగా స్పందిస్తూ, 800 మంది ఖైదీలకు విధించనున్న ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసినందుకు ఇరాన్ పాలకులకు కృతజ్ఞతలు తెలపడం గమనార్హం.
కాగా, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖామెనై మాత్రం డోనాల్డ్ ట్రంప్‌ను “నేరస్థుడి”గా వర్ణించారు. “దేశాన్ని యుద్ధంలోకి లాగాలని అనుకోం.. కానీ దేశీయ, అంతర్జాతీయ నేరస్తులను శిక్షించకుండా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తమ దేశంలో చోటుచేసుకున్న వేలాది మంది చనిపోవడానికి యూఎస్, ఇజ్రాయెల్ మద్దతు కలిగిన ఉగ్రవాదులే కారణమని ఆయన ఆరోపించారు.
‘మొహారెబ్’ కేసులు
ఇరాన్ న్యాయవ్యవస్థ ప్రతినిధి అస్గర్ జహంగిర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొన్ని చర్యలను ‘మొహారెబ్’ (దేవునిపై యుద్ధం చేసే చర్య) గా గుర్తించామన్నారు. ఇరాన్ చట్టాల ప్రకారం ఇవి ఉరిశిక్ష విధించే స్థాయి నేరాలుగా పేర్కొన్నారు.
భిన్న గణాంకాలు
అమెరికా మానవ హక్కుల సంస్థ HRANA ప్రకారం.. ఇప్పటివరకు 3,308 మంది మృతి చెందినట్లు, మరో 4,382 కేసులు పరిశీలనలో ఉన్నట్లు, 24,000 మందికి పైగా అరెస్టు అయినట్లు పేర్కొంది.
కుర్దిష్ ప్రాంతాల్లో హింస
ఇరాన్ వాయవ్యంలోని కుర్దిష్ ప్రాంతాల్లోనే అత్యధికంగా ప్రాణనష్టం చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గతంలోనూ ఇక్కడ అల్లర్లు జరిగాయి. ఇరాక్ నుంచి కుర్దిష్ వేర్పాటువాదులు ఇరాన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు, ఈ విషయాన్ని రాయిటర్స్ కు తెలిపినట్లు రాసుకొచ్చింది.
ప్రస్తుతం పరిస్థితి
తీవ్ర దమనకాండతో ఇరాన్‌లో ప్రస్తుతం నిరసనలు చాలావరకు అణచివేయబడినట్లు స్థానికులు, సర్కారు మీడియా పేర్కొంటోంది. కాగా ఇరాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయంగా విమర్శలు వెలువడుతున్నాయి.