అక్షరటుడే, ఆర్మూర్: Armoor | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై (Chief Justice BR Gavai) న్యాయవాది చెప్పుతో దాడి చేసేందుకు యత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత ఐక్య సంఘటన నాయకులు అన్నారు. ఈ మేరకు దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు.
అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి (Ambedkar statue) పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత ఐక్య సంఘటన డివిజన్ నాయకులు జంగం అశోక్, గుమ్మడి చంద్రయ్య, పింజా పెద్ద భోజన్న, భూమేశ్వర్, పింజ సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.