అక్షరటుడే, ఇందూరు: Prostitution | చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు లాడ్జ్‌లు Lodges అడ్డాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా వ్యభిచారానికి హద్దు అదుపు లేకుండా పోతోంది.
యువతను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. అమ్మాయిలను ఎర వేస్తున్న నిర్వాహకులు విటులను ఆకర్షిస్తూ.. రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు.
Prostitution | రెడ్ హ్యాండెడ్‌గా..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో Nizamabad district headquarters వ్యభిచారం Prostitution కోరలు చాస్తోంది. తాజాగా వెలుగు చూసిన ఘటన ఇందుకు అద్దం పడుతోంది.
నగరంలోని రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న ఓ లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారం మేరకు ఒకటో ఠాణా పోలీసులు రైడ్ చేశారు.
ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తన బృందంతో కలిసి సదరు లాడ్జిపై దాడి చేయగా.. ఓ జంట రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. దీంతో మహిళతోపాటు విటుడు, లాడ్జి మేనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
