అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | పోలీసు శాఖలో (Police Department) పదోన్నతులు బాధ్యతను పెంచుతాయని, రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలందించాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో (Sadashivanagar Police Station) హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఏఎస్సైగా పదోన్నతి పొందిన డి.దేవరాజు ఎస్పీని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదోన్నతి చిహ్నాలను అలంకరించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
SP Rajesh Chandra | క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేయాలి..
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థలో క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయన్నారు. పదోన్నతులు కేవలం హోదా మార్పు మాత్రమే కాదని, విధి నిర్వహణలో బాధ్యతను మరింత పెంచుతుందని తెలిపారు. పదోన్నతి పొందిన సిబ్బంది తమ జీవనశైలిని మెరుగుపరుచుకుని ప్రజలకు మరింత చేరువగా ఉండి నిజాయితీతో సేవలు అందించాలని సూచించారు. ఈ మధ్య సైబర్ నేరాలు (Cyber Crimes) ఎక్కువగా జరుగుతున్నాయని వాటిని అరికట్టేవిధంగా ప్రజలను జాగృతం చేయాల్సిన బాధ్యత పోలీసు సిబ్బందిపై ఉందన్నారు. రోడ్డు ప్రమాదాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని (Arrive Alive Program) విజయవంతం చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.