అక్షరటుడే, భీమ్గల్: Bheemgal Municipality | మున్సిపాలిటీ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు జె.జె. నర్సయ్య అన్నారు. మంగళవారం భీమ్గల్ మున్సిపాలిటీ (Bheemgal Municipality) పరిధిలోని 2వ, 10వ వార్డుల్లో టీయూఐఎఫ్‌డీసీ (TUIFDC) నిధులు రూ.3 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ (Muthyala Sunil Kumar) సహకారంతో ఈ నిధులను మంజూరు చేయించినట్లు ఆయన తెలిపారు.
Bheemgal Municipality | పట్టణ అభివృద్ధే మా లక్ష్యం..
ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పట్టణంలో మౌలిక వసతులు కుంటుపడ్డాయని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. పేదల సొంతింటి కల నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఇప్పటికే పట్టణంలో అనేక మందికి ఇళ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు.
Bheemgal Municipality | మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా..
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలపాలని, పట్టణ సమగ్రాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకొచ్చి భీమ్గల్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పర్స అనంతరావు, మాజీ కౌన్సిలర్ సీహెచ్ గంగాధర్, చెప్పల రాజన్న, చింతలూరి దశరథ్, చెప్పల నర్సయ్య, రూపాల నర్సయ్య, కాంతయ్య, సేవాలాల్, కిషన్, గంగాధర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.