అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభం నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ(Profit booking)కు ప్రాధాన్యత ఇవ్వడంతో నాలుగు సెషన్ల తర్వాత ప్రధాన సూచీలు నష్టాలతో ముగిశాయి.
బుధవారం ఉదయం సెన్సెక్స్ 27 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ(Nifty) 29 పాయింట్ల నష్టంతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కోలుకుని లాభాలబాటపట్టిన ఎక్కువ సేపు నిలదొక్కుకోలేకపోయాయి. సెన్సెక్స్ ఇంట్రాడే(Intraday) గరిష్ట స్థాయి అయిన 82,257 నుంచి 81,646 పాయింట్లకు, నిఫ్టీ 25,192 నుంచి 25,008 పాయింట్లకు పడిపోయాయి. చివరికి సెన్సెక్స్(Sensex) 153 పాయింట్ల నష్టంతో 81,773 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 25,046 వద్ద స్థిరపడ్డాయి.
Stock Market | పవర్, ఇన్‌ఫ్రాలో సెల్లాఫ్..
పవర్(Power), ఎనర్జీ, ఇన్‌ఫ్రా తదితర సెక్టార్లు సెల్లాఫ్‌కు గురయ్యాయి. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్ 1.67 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 0.37 శాతం పెరిగాయి. రియాలిటీ ఇండెక్స్ 1.88 శాతం, పవర్ 1.49 శాతం, ఆటో 1.35 శాతం, యుటిలిటీ 1.29 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.20 శాతం, ఇన్‌ఫ్రా 1.15 శాతం, పీఎస్‌యూ 1.03 శాతం, క్యాపిటల్ మార్కెట్ 0.92 శాతం, ఎనర్జీ 0.90 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 0.82 శాతం నష్టపోయాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్(Mid cap index) 0.74 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.42 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.38 శాతం తగ్గాయి.
Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,740 కంపెనీలు లాభపడగా 2,434 స్టాక్స్ నష్టపోయాయి. 156 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 161 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 144 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
Stock Market | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 9 కంపెనీలు లాభాలతో ఉండగా.. 21 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. టైటాన్ 4.38 శాతం, ఇన్ఫోసిస్ 2.67 శాతం, టీసీఎస్ 1.78 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.34 శాతం, టెక్ మహీంద్రా 1.17 శాతం పెరిగాయి.
Stock Market | Top losers..
టాటామోటార్స్ 2.41 శాతం, ఎంఅండ్‌ఎం 1.91 శాతం, బీఈఎల్ 1.67 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.55 శాతం, ట్రెంట్ 1.46 శాతం నష్టపోయాయి.