అక్షరటుడే, ఇందూరు: Prajavani | ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit) అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో (Prajavani) జిల్లావ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
Prajavani | 73 ఫిర్యాదులు..
ఈ మేరకు సోమవారం 73 ఫిర్యాదులు అందినట్లు అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్‌తో పాటు సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్ర కుమార్, నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్‌లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా.. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.