అక్షరటుడే, వెబ్డెస్క్: PM Modi | ఇండిగో సంక్షోభంతో దేశవ్యాప్తంగా వేలాది విమానాలు రద్దు అయి ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. ఇండిగో విమానాల (Indigo Flights) రద్దు ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.
నిబంధనలు వ్యవస్థల బాగు కోసమేనని, ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదని మోదీ అన్నారు. ఈ మేరకు ఆయన ఎన్డీఏ మిత్రపక్ష సమావేశంలో మాట్లాడరని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజ్ (Union Minister Kiren Rijij) తెలిపారు. ప్రభుత్వం కారణంగా ప్రజలు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా చూసుకోవాలన్నారు. నియమాలు, నిబంధనలు మంచివి, కానీ అవి వ్యవస్థను మెరుగుపరచడానికి అన్నారు. ప్రజలను వేధించడానికి కాదని స్పష్టం చేశారు. సాధారణ పౌరులను ఇబ్బంది పెట్టే చట్టం, నిబంధన ఉండకూడదని ప్రధానమంత్రి మోదీ (PM Modi) చెప్పారు. చట్టాలు ప్రజలపై భారంగా ఉండకూడదన్నారు.
PM Modi | కొనసాగుతున్న సంక్షోభం
ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. మంగళవారం సైతం పలు విమానాలు రద్దు అయ్యాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇండిగో విమానాల రద్దు పర్వం రెండో వారంలోకి అడుగుపెట్టగా, మంగళవారం దాదాపు 500 విమానాలు నిలిచిపోయాయి. ఢిల్లీ మరియు బెంగళూరు వరుసగా 152 మరియు 121 విమానాలు రద్దు చేసుకోవడంతో అత్యధిక నష్టాలను చవిచూశాయి. చెన్నై (81), హైదరాబాద్ (58), ముంబై (31), లక్నో (26), మరియు అహ్మదాబాద్ (16)లలో విమానాలు రద్దు అయ్యాయి.