అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదలైంది.
ఏపీలోని కర్నూల్(Kurnool)కు మోదీ రానున్నారు. గురువారం ఉదయం 7.50 గంటలకు ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వస్తారు. ఉదయం 10.20కు కర్నూలు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సున్నిపెంటకు వెళ్లారు. అనంతరం ఉదయం 11.10 కి రోడ్డుమార్గంలో శ్రీశైలం భ్రమరాంబ గెస్ట్ హౌస్‌కు ప్రధాని చేరకుంటారు. అనంతరం శ్రీశైలంలో మల్లికార్జున స్వామి(Srisailam Mallikarjuna Swamy)ని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి సున్నిపెంట చేరుకొని హెలిక్యాప్టర్‌లో రాగమయూరి గ్రీన్ హిల్స్ వెంచర్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు గ్రీన్ హిల్స్ వెంచర్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ సభలో మాట్లాడతారు.
కేంద్రం ఇటీవల జీఎస్టీ సంస్కరణలు(GST Reforms) అమలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలోని కూటమి ప్రభుత్వం సూపర్ జీఎస్టీ సూపర్ హిట్ పేరిట సభ నిర్వహిస్తుంది. ఈ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan), మంత్రి లోకేశ్ సైతం మాట్లాడతారు. అనంతరం ప్రధాని సాయంత్రం 4.15 గంటలకు రోడ్డుమార్గంలో నన్నూరు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్‌లో కర్నూల్ ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. అనంతరం సాయంత్రం 4.40కు ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలు దేరుతారు.