అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM Modi | దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) శనివారం ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.
కోల్‌కతా సమీపంలోని హౌరాను, గౌహతిలోని కామాఖ్య జంక్షన్‌కు అనుసంధానించే వందే భారత్ స్లీపర్ రైలును (Vande Bharat sleeper train) ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఇది పశ్చిమ బెంగాల్, అస్సాం మధ్య హై-స్పీడ్ రైలు కనెక్షన్‌ను ఏర్పాటు చేస్తుంది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా టౌన్ నుంచి భారతదేశపు తొలి స్లీపర్ రైలును ప్రధాని ప్రారంభించారు. ఆధునిక భారతదేశంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి వందేభారత్ రైలును తీర్చిదిద్దారు. దీంతో హౌరా-గువహతి (Howrah-Guwahati)(కామాఖ్య) మార్గంలో ప్రయాణ సమయం దాదాపు 2.5 గంటలు తగ్గనుంది.
PM Modi | బెంగాల్లో గెలుస్తాం
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. మాల్దా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ చుట్టూ సుపరిపాలన రికార్డు ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయని అన్నారు. కాషాయ పార్టీ ఇప్పటికే తూర్పు భారత రాష్ట్రాలను విద్వేష రాజకీయాల నుంచి విముక్తి చేసిందని నొక్కి చెప్పారు. ప్రజలు, ముఖ్యంగా జెన్ జెడ్ తరం వారు, బీజేపీ అభివృద్ధి నమూనాపై విశ్వాసం కలిగి ఉన్నారని అన్నారు.
PM Modi | టీఎంసీపై విమర్శలు
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై ప్రధాని విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ప్రజలను దోచుకుంటోందని, కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయనివ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం బెంగాల్‌కు 40 సార్లు వరద సహాయ నిధులను పంపిందని, కానీ బాధితులకు అవి అందలేదని ఆయన ఆరోపించారు. టీఎంసీని అధికారం నుంచి తొలగించి బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడే పశ్చిమ బెంగాల్ అభివృద్ధి చెందుతుందన్నారు.