అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ (International Kite Festival)ను సోమవారం ప్రారంభించారు. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో కలిసి గాలిపటం ఎగుర వేశారు.
ఫ్రెడరిక్ మెర్జ్ (Friedrich Merz) తన రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా సోమవారం గుజరాత్ చేరుకున్నారు. అనంతరం మోదీని కలిశారు. ఇద్దరు నాయకులు సబర్మతి నదీ తీరంలో జరిగిన అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవంలో పాల్గొన్నారు. హనుమంతుడిని చిత్రీకరించిన గాలిపటాన్ని వారు ఎగురవేశారు.
PM Modi | కీలక చర్చలు
ప్రధాని మోదీ, ఛాన్సలర్ మెర్జ్ కీలక చర్చలు జరపనున్నారు. భారతదేశం-జర్మనీ సంబంధాలను బలోపేతం చేయడానికి ద్వైపాక్షిక చర్చల నిర్వహించనున్నారు. కైట్ ఫెస్టివల్ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ, జర్మన్ ఛాన్సలర్ మెర్జ్‌ను అహ్మదాబాద్ (Ahmedabad)లోని సబర్మతి ఆశ్రమానికి స్వాగతించారు. సమావేశం తర్వాత ఇద్దరు నాయకులు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. భారత్-జర్మనీ 75 సంవత్సరాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని జరుపుకుంటున్నాయి.