Homeతాజావార్తలుGlobal Summit | గ్లోబల్ సమ్మిట్​కు రావాలని ప్రధానికి ఆహ్వానం

Global Summit | గ్లోబల్ సమ్మిట్​కు రావాలని ప్రధానికి ఆహ్వానం

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్​కు హాజరు కావాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్​రెడ్డి ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Global Summit | తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్​కు (Telangana Rising Global Summit) హాజరు కావాలని ప్రధాని మోదీని (Prime Minister Modi) సీఎం రేవంత్​రెడ్డి ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ప్రధానిని కలిశారు.

భారత్ ఫ్యూచర్ సిటీలో (Bharat Future City) నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్‌కు సంబంధించి ఆహ్వాన పత్రికను ప్రధానికి అందజేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా.. తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం రూపొందించినట్టు సీఎం వివరించారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామన్నారు. పలు రంగాల నిపుణులు, నీతి ఆయోగ్ సూచనల మేరకు విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినట్టు వివరించారు.

Global Summit | అభివృద్ధికి సహకరించాలి

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని సీఎం కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు (Hyderabad Metro Rail expansion) అవసరమైన అనుమతులు మంజూరు చేయాలన్నారు. మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందని, రూ.43,848 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్​గా చేపట్టేందుకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి కేబినేట్ ఆమోదంతో పాటు ఆర్థిక పరమైన అనుమతులు, దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు.

Global Summit | గ్రీన్​ఫీల్డ్​ ఎక్స్​ప్రెస్​ వే కోసం..

హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్ట్ వరకు 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్​ప్రెస్​ హైవే (Greenfield Express Highway), హైదరాబాద్ నుంచి బెంగుళూరు హై స్పీడ్ కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్​ప్రెస్​వే నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చోరవ చూపాలని సీఎం (CM Revanth Reddy) ప్రధానిని కోరారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు టైగర్ రిజర్వ్ మీదుగా నాలుగు వరుసల ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని వినతిపత్రం అందించారు.

Must Read
Related News