PM Modi | కాంగ్రెస్‌పై ప్రధాని విమర్శలు.. కాంగ్రెస్​ ప్రతికూల రాజకీయాలను తిరస్కరిస్తున్నారని వ్యాఖ్య

అక్షరటుడే, ఇంటర్నెట్‌ డెస్క్‌: PM Modi | కాంగ్రెస్​ పార్టీని ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రతికూల రాజకీయాలను దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారని వ్యాఖ్యానించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాం (Assam) రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా కలియాబోర్‌ ప్రాంతంలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజల్లో మద్దతు పెరుగుతోందన్నారు. ప్రజల మొదటి ఎంపికగా తమ పార్టీ మారిందని పేర్కొన్నారు. ఓటర్లు సుపరిపాలన, అభివృద్ధిని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. […]

అక్షరటుడే, ఇంటర్నెట్‌ డెస్క్‌: PM Modi | కాంగ్రెస్​ పార్టీని ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రతికూల రాజకీయాలను దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారని వ్యాఖ్యానించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాం (Assam) రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా కలియాబోర్‌ ప్రాంతంలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజల్లో మద్దతు పెరుగుతోందన్నారు. ప్రజల మొదటి ఎంపికగా తమ పార్టీ మారిందని పేర్కొన్నారు. ఓటర్లు సుపరిపాలన, అభివృద్ధిని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బీహార్‌ ఎన్నికలతో పాటు తిరువనంతపురం, ముంబయి (Thiruvananthapuram and Mumbai) స్థానిక ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైందని చెప్పారు.

PM Modi | కాంగ్రెస్‌కు అభివృద్ధి అజెండా లేదు

కాంగ్రెస్​ ఈ దేశాన్ని ఎన్నో ఏళ్లు పాలించిందని.. అయినా కూడా ఆ పార్టీకి అభివృద్ధి అజెండా లేదని ప్రధాని విమర్శించారు. అందువల్లే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. భారత వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తులతో ఆ పార్టీ జట్టు కట్టిందంటూ విమర్శలు చేశారు.

PM Modi | కాంగ్రెస్‌ అస్సాంలో వారికి ఆశ్రయం

కాంగ్రెస్‌ అస్సాంలో చొరబాటుదారులకు ఏళ్లుగా ఆశ్రయం ఇచ్చిందని మోదీ ఆరోపించారు. వారి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ ప్రయత్నం అని అన్నారు. ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో చొరబాటుదారులు రాష్ట్రంలోకి వచ్చారన్నారు. అక్రమ వలసదారులు ప్రజల భూములు ఆక్రమించుకుంటూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో అస్సాం ప్రజల అస్తిత్వం ప్రమాదంలో పడిందన్నారు. ప్రస్తుత బీజేపీ సర్కారు ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...