అక్షరటుడే, వెబ్‌డెస్క్: Honda Rebel 500 | జపాన్(Japan)కు చెందిన హోండా మోటార్ కంపెనీ (honda motor company) సబ్సిడరీ అయిన హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) మనదేశంలో తమ ప్రీమియం మోటార్‌సైకిళ్ల (premium motor cycel) శ్రేణిని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం గురుగ్రామ్, ముంబయి, బెంగళూరులోని ఎంపిక చేసిన బిగ్‌వింగ్ (BigWing) డీలర్‌షిప్‌లో బుకింగ్స్ ప్రారంభించింది. వచ్చేనెలలో డెలివరీలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కాగా 471 cc ఇంజిన్, 46 Hp శక్తితో తీసుకువచ్చిన ఈ మోడల్ బైక్ ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు (ఎక్స్ షోరూమ్) అని కంపెనీ పేర్కొంది.
Honda Rebel 500 | ఫీచర్స్..
రెబెల్ 500 ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్‌పై నిర్మితమైంది. ఈ బైక్(bike)లో 11.2 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయల్ ట్యాంక్ (fuel tank) ఉంది. దీని బరువు సుమారు 195 కిలోలు. రెండు వైపులా 16 అంగుళాల ప్రత్యేకమైన వీల్స్ (Wheels), ముందువైపు ఫ్యాట్ 130 సెక్షన్ టైర్, వెనకవైపు 150 సెక్షన్ టైర్, భద్రత కోసం డ్యూయల్ చానల్ ఏబీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 471 సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ ప్యార్‌లల్ ట్విన్ సిలిండర్, 4 స్ట్రోక్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ శక్తివంతమైన ఇంజిన్ గరిష్టంగా సుమారు 46 హార్స్‌పవర్ (హెచ్‌పీ) శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తోంది. రెండు డిస్క్‌బ్రేక్‌లు, డ్యూయల్ చానల్ ఏబీఎస్‌తో వస్తోంది. కవాసకి (Kawasaki) ఎలిమినేటర్ 500, రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) షాట్‌గన్ 650, రాయల్ ఎన్‌ఫీల్డ్‌కే చెందిన సూపర్ మీటియోర్ 650 వంటి మోడళ్లతో ఇది పోటీ పడుతుందని భావిస్తున్నారు.