అక్షరటుడే, వెబ్డెస్క్ : President Draupadi Murmu | రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 17 హైదరాబాద్కు రానున్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు వస్తుంటారు. ఇందులో భాగంగా ఈ ఏడాది షెడ్యూల్ను రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) విడుదల చేసింది.
ఢిల్లీ (Delhi)లో శీతాకాలంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ప్రతి ఏడాది డిసెంబర్లో విడిది కోసం హైదరాబాద్ వస్తుంటారు. కంటోన్మెంట్లోని బొల్లారంలో గల రాష్ట్రపతి నిలయంలో ముర్ము బస చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17న ఆమె ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టు (Begumpet Airport)కు చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు. ఐదు రోజుల పాటు ముర్ము నగరంలో ఉంటారు. ఇందులో భాగంగా పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు.
President Draupadi Murmu | 22న తిరుగు పయనం
హైదరాబాద్ (Hyderabad) పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఈ నెల 19న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో నిర్వహించే కార్యక్రమాలకు హాజరవుతారు. డిసెంబర్ 21న వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం వారికి తేనిటి విందు ఇస్తారు. 22న ఉదయం రాష్ట్రపతి ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.కాగా రాష్ట్రపతి నవంబర్లో సైతం హైదరాబాద్లో పర్యటించారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆమె హైదరాబాద్కు వచ్చారు. రాష్ట్రపతి నిలయంలో నిర్వహించే భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభించారు.