అక్షరటుడే, వెబ్డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు (ZPTC Elections) జరగనున్నాయి. అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ఇప్పటికే తెలిపింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఈ నెల 9న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. అదే రోజు నుంచి తొలి దశ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. ఎంపీటీసీ(MPTC Elections), జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి మొత్తం 1,35,264 బ్యాలెట్ బాక్సులు అవసరం అవుతాయని ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,18,547 బాక్సులు ఉన్నాయని వెల్లడించింది. ఎన్నికల నాటికి మిగతా బాక్సులను సమకూర్చుకునేందుకు చర్యలు చేపట్టింది.
Local Body Elections | సిద్ధంగా సిబ్బంది
స్థానిక ఎన్నికల (Local Body Elections) కోసం ఇప్పటికే అధికారులు ఎన్నికల సిబ్బందిని నియమించారు. వారికి శిక్షణ కూడా ఇచ్చారు. ఆయా జిల్లా కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి. ఎంపీటీసీ ఎన్నికలకు 2,337 మంది ఆర్వోలు, 2,340 మంది ఏఆర్వోలు, 39,533 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,58,725 ఇతర సిబ్బంది రెడీగా ఉన్నట్లు ఎన్నికల సంఘం(Election Commission) తెలిపింది.