Vivo X300 Pro 5G | అదిరిపోయే డిజైన్‌తో వీవో నుంచి ప్రీమియం ఫోన్‌.. సేల్‌ ఎప్పటినుంచి అంటే..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vivo X300 Pro 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ (Smart Phone) కంపెనీ అయిన వీవో అధునాతన ఫీచర్లతో మరో ప్రీమియం మోడల్‌ను విడుదల చేసింది. అదిరిపోయే లుక్‌, అధునాతన ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్‌.. డిసెంబర్‌ 10 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)తో పాటు వివో ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది. దీని స్పెసిఫికేషన్స్‌ తెలుసుకుందామా.. డిస్‌ప్లే : 6.78 ఇంచ్‌ 1.5k ఎల్టీపీవో ఓఎల్‌ఈడీ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vivo X300 Pro 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ (Smart Phone) కంపెనీ అయిన వీవో అధునాతన ఫీచర్లతో మరో ప్రీమియం మోడల్‌ను విడుదల చేసింది. అదిరిపోయే లుక్‌, అధునాతన ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్‌.. డిసెంబర్‌ 10 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)తో పాటు వివో ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది. దీని స్పెసిఫికేషన్స్‌ తెలుసుకుందామా..

డిస్‌ప్లే : 6.78 ఇంచ్‌ 1.5k ఎల్టీపీవో ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే అమర్చారు. ఇది 120Hz రిఫ్రెష్‌ రేట్‌, హెచ్‌డీఆర్‌ 10 ప్లస్‌ సపోర్ట్‌, 2800 * 1260 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, ఐపీ68/ఐపీ69 డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టన్స్‌ కలిగి ఉంది.

సాఫ్ట్‌వేర్‌ : మీడియాటెక్‌ డైమెన్సిటీ 9500 ఎస్‌వోసీ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్‌.. ఆండ్రాయిడ్‌ 16 ఆపరేటింగ్‌ సిస్టం ఆధారిత ఫన్‌ టచ్‌ ఓఎస్‌ 16తో పనిచేస్తుంది.

బ్యాటరీ సామర్థ్యం : 6510 mAh బ్యాటరీ సామర్థ్యంతో తీసుకువస్తున్న ఈ ఫోన్‌.. 90 డబ్ల్యూ ఫాస్ట్‌ చార్జింగ్‌ను, 40w వైర్‌లెస్‌ చార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది.

కెమెరా సెటప్‌ : వెనకవైపు 50 మెగా పిక్సెల్‌(MP) మెయిన్‌ కెమెరాతో పాటు 200 మెగా పిక్సెల్‌ పెరిస్కోప్‌ టెలీఫోటో లెన్స్‌, 50 మెగా పిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ లెన్స్‌తో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెట్‌ అప్‌ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 50 మెగా పిక్సెల్‌ కెమెరా కలిగి ఉంది.

వేరియంట్‌ : 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ మాత్రమే తీసుకువచ్చారు. దీని ధర రూ. 1,09,999 గా ఉంది.

కార్డ్‌ ఆఫర్‌ : ఫ్లిప్‌కార్ట్‌ ఎస్‌బీఐ, ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లతో 5 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ లభిస్తుంది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...