Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్​.. అబార్షన్ చేసిన ప్రైవేట్ వైద్యుడు..!

Kamareddy | పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్​.. అబార్షన్ చేసిన ప్రైవేట్ వైద్యుడు..!

కామారెడ్డిలో గర్భ విచ్ఛిత్తి ఘటనలు ఆగడం లేదు. పెళ్లి కాని యువతికి ఓ ప్రైవేట్​ వైద్యుడు గుట్టుగా అబార్షన్​ చేశాడు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డిలో గర్భ విచ్ఛిత్తి ఘటనలు ఆగడం లేదు. గతంలో ఓ ఆస్పత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు, గర్భంలో ఆడపిల్లలు ఉంటే అబార్షన్లు చేసేవారు. పెళ్లి కాకుండా గర్భవతి (pregnant) అయిన వారికి సైతం అబార్షన్లు చేస్తున్నారన్న ఆరోపణలపై ఆ ఆస్పత్రిని కోర్టు ఆదేశాలతో (court orders) అధికారులు సీజ్ చేశారు. తాజాగా పట్టణంలో మరో అబార్షన్​ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

తాడ్వాయి మండలంలోని (Tadwai mandal) ఓ గ్రామానికి చెందిన అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఆ అమ్మాయి గర్భం దాల్చింది. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో ఓ ప్రైవేట్ వైద్యుడిని ఆశ్రయించారు. అమ్మాయి గర్భం తొలగించేందుకు సదరు వైద్యుడితో రూ.70 వేలకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఒప్పందంలో భాగంగా రూ.50 వేలు చెల్లించగా సదరు వైద్యుడు అబార్షన్ చేసినట్లు తెలిసింది. మరొక రూ.20 వేలు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదు. ఈ విషయం ఇప్పుడు బయటకు పొక్కడంతో మరోసారి గుట్టుగా అబార్షన్లు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Must Read
Related News