అక్షరటుడే, ఎల్లారెడ్డి : Local Body Elections | నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎల్పీవో సురేందర్ (DLPO Surender) సూచించారు. మత్తమాల గ్రామపంచాయతీలో నామినేషన్ కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం (Election Commission) నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు. రెండో విడత నామినేషన్ల ప్రక్రియ చివరి రోజున ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నందున, అందుకు తగినవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
చివరి సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. కాబట్టి అభ్యర్థులు ముందుజాగ్రత్త వహించాలన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్ (Nomination Center) వద్ద హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని సూచించారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు.
