అక్షరటుడే, ఎల్లారెడ్డి: RTA Yellareddy | రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రఫీ (Motor Vehicle Inspector Rafi) అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ (District Transport Department) ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.
RTA Yellareddy | ప్రథమ చికిత్సపై అవగాహన ఉండాలి
ప్రతి విద్యార్థి ప్రథమ చికిత్సపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని ఎంవీఐ రఫీ సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడడంలో ‘గోల్డెన్ అవర్’ అత్యంత కీలకమని తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాద (road accident) బాధితులకు సహాయం చేసే గుడ్ సమారిటన్‌లకు ప్రభుత్వం కల్పిస్తున్న చట్టపరమైన రక్షణలు, ప్రోత్సాహకాలు గురించి వివరించారు.
సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారి ఇర్షాద్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు తెలుసుకున్న ట్రాఫిక్ నిబంధనలను తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.