- Advertisement -
HomeUncategorizedPre-release event | ప్రీ రిలీజ్​ ఈవెంట్.. లైవ్​లో ప్రియురాలికి ప్రపోజ్ చేసిన దర్శకుడు

Pre-release event | ప్రీ రిలీజ్​ ఈవెంట్.. లైవ్​లో ప్రియురాలికి ప్రపోజ్ చేసిన దర్శకుడు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre-release event : ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే సినిమాకు ప్రేక్షకులను మరింత దగ్గర చేసే వేడుక. సినిమా యూనిట్ ను అభినందించడం, తమకు సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలపడం వగైరా ఉంటాయి. ఇదంతా సరదాగా సాగిపోతుంటుంది. అయితే, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ తమిళ దర్శకుడు ప్రియురాలికి ప్రపోజ్ చేయడం హాట్​ టాక్ గా మారింది.

కోలీవుడ్ సీనియర్ నటుడు శశి కుమార్ Kollywood senior actor Shashi Kumar హీరోగా చేసిన టూరిస్టు ఫ్యామిలీ Tourist Family  అనే సినిమాతో అభిషన్ జీవంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల చెన్నై Chennai లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు సినిమా యూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

- Advertisement -

కాగా, దర్శకుడు అభిషన్ director Abhishan టూరిస్టు ఫ్యామిలీ ప్రీ రిలీజ్ వేదికపై నుంచి తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటానని, ఇందుకు ఆమె ఒప్పుకోవాలని కోరుతూ ప్రపోజ్ చేశాడు. ఇదే ఈవెంట్ కు వచ్చిన అతగాడి ప్రేయసి మనోడు ఇచ్చిన షాక్​కి ఆనందంలో కంటతడి పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన టూరిస్టు ఫ్యామిలీ మే 1 న రిలీజ్ కాబోతోంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News