Homeబిజినెస్​Pre Market analysis | ట్రంప్‌ టారిఫ్‌లు.. ఎరుపెక్కిన స్టాక్‌ మార్కెట్లు

Pre Market analysis | ట్రంప్‌ టారిఫ్‌లు.. ఎరుపెక్కిన స్టాక్‌ మార్కెట్లు

Pre Market analysis | అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి టారిఫ్‌లతో చైనాపై విరుచుకుపడ్డారు. దీని ప్రభావం గ్లోబల్‌ మార్కెట్లపై తీవ్రంగా పడింది. ఫలితంగా దాదాపు అన్ని మార్కెట్లు ఎరుపెక్కాయి.

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre Market analysis | అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(US President Trump) మరోసారి టారిఫ్‌లతో చైనాపై విరుచుకుపడ్డారు. దీని ప్రభావం గ్లోబల్‌ మార్కెట్లపై కనిపిస్తోంది. దాదాపు అన్ని మార్కెట్లు ఎరుపెక్కాయి.

ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య సీజ్‌ఫైర్‌(Ceasefire)కు అంగీకారం కుదరడం, ఎఫ్‌ఐఐ(FII)లు పాజిటివ్‌గా మారడం, భారత్‌, యూఎస్‌ మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో పురోగతి నేపథ్యంలో మార్కెట్‌ సెంటిమెంట్‌ బలపడుతున్న తరుణంలో ట్రంప్‌ మరోసారి బాంబ్‌ పేల్చారు. చైనాతో ట్రేడ్‌ టారిఫ్‌ వార్‌(Trade war)కు మళ్లీ తెరతీశారు. దీని ప్రభావం మన మార్కెట్లపైనా కనిపించే అవకాశాలున్నాయి.

Pre Market analysis | యూఎస్‌ మార్కెట్లు (US markets)..

చైనాతో యూఎస్‌ ట్రేడ్‌ వార్‌ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌(Wallstreet) కుదుపునకు గురయ్యింది. గత సెషన్‌లో నాస్‌డాక్‌(Nasdaq) 3.56 శాతం, ఎస్‌అండ్‌పీ 2.71 శాతం నష్టపోయాయి. సోమవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ మాత్రం కోలుకుని 0.85 శాతం లాభంతో ఉంది.

Pre Market analysis | యూరోప్‌ మార్కెట్లు (European markets)..

సీఏసీ 1.56 శాతం నష్టంతో, డీఏఎక్స్‌(DAX) 1.53 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.87 శాతం నష్టాలతో ముగిశాయి.

Pre Market analysis | ఆసియా మార్కెట్లు (Asian markets)..

సోమవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో సాగుతున్నాయి. ఉదయం 7.50 గంటల సమయంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌(Hang Seng) 1.98 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 1.77 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.15 శాతం, సింగపూర్‌ ఎక్స్ఛేంజ్‌ స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ (Singapore  Straits Times) 1.09 శాతం, సౌత్‌ కొరియాకు చెందిన కోస్పీ (South Korea‘s Kospi) 0.97 శాతం నష్టంతో ఉన్నాయి.

గిఫ్ట్‌ నిఫ్టీ (Gift nifty)0.36 శాతం నష్టంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈరోజు గ్యాప్‌ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జపాన్‌లో సెలవు కారణంగా నిక్కీలో ట్రేడిరగ్‌ జరగడంలేదు.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్‌ఐఐలు వరుసగా నాలుగో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులు(Net buyers)గా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 459 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
  • డీఐఐ(DII)లు వరుసగా 33వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉండి, రూ. 1,707 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.06 నుంచి 1.32 కు పెరిగింది. విక్స్‌(VIX) 0.17 శాతం తగ్గి 10.10 వద్ద ఉంది.
  • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 63.77 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు బలపడి 88.69 వద్ద నిలిచింది.
  • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.04 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 98.88 వద్ద కొనసాగుతున్నాయి.

చైనా(China)నుంచి దిగుమతి చేసుకునే అన్ని కీలకమైన సాఫ్ట్‌వేర్‌లపై అదనంగా వంద శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించడంతో యూఎస్‌, చైనా ట్రేడ్‌ టారిఫ్‌ వార్‌ మళ్లీ ముదిరింది. చైనా సైతం వెనక్కి తగ్గబోమన్న సంకేతాలను ఇచ్చింది. దీంతో మార్కెట్లు అస్థిరతకు గురవుతున్నాయి.