అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pre market analysis : గ్లోబల్ మార్కెట్లు(Global markets) అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. సోమవారం అమెరికాలో మెమోరియల్ డే సందర్భంగా వాల్‌స్ట్రీట్ (Wallstreet)కు సెలవు. యూరోప్ మార్కెట్లు పాజిటివ్‌గా ముగియగా.. ప్రధాన ఆసియా మార్కెట్లు మాత్రం నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్(Dow Jones futures) మాత్రం 0.89 శాతం లాభంతో కొనసాగుతోంది.
Pre market analysis | ఆసియా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి..
జర్మనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ డీఏఎక్స్(DAX) 1.66 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 1.20 శాతం లాభంతో ముగిశాయి. ప్రధాన ఆసియా(Asia) మార్కెట్లు మంగళవారం నష్టాలతో సాగుతున్నాయి. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.45 శాతం నష్టంతో ఉండగా.. కోస్పీ 0.41 శాతం, నిక్కీ(Nikkei) 0.24 శాతం, షాంఘై 0.21 శాతం, హంగ్‌సెంగ్ 0.18 శాతం నష్టాలతో ఉన్నాయి. స్ట్రెయిట్ టైమ్స్ ఫ్లాట్‌గా కదలాడుతోంది. గిఫ్ట్‌నిఫ్టీ(Gift nifty) 0.06 శాతం నష్టంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు కూడా ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Pre market analysis | ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు నెట్ బయ్యర్లుగా..
ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు నెట్ బయ్యర్లు(Net buyers)గా కొనసాగుతున్నారు. ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 136 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. డీఐఐ(DII)లు నికరంగా రూ. 1,745 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
Pre market analysis | ఆసియాలో కోవిడ్ వ్యాప్తి..
ఆసియాలో కోవిడ్(Covid) వ్యాప్తి పెరుగుతోంది. భారత్‌లోనూ కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ఆందోళన నెలకొంది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 11 వందలు దాటింది. ఎక్కువగా కేరళలో కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులలోనూ వైరస్ వ్యాపిస్తోంది.
క్రూడ్ ఆయిల్(Crude oil) ధర బ్యారెల్‌కు 0.33 శాతం తగ్గి 61.31 డాలర్ల వద్ద ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.09 కి చేరింది. యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్(Bond yields) 0.40 శాతం తగ్గి 4.49 వద్ద ఉంది. యూఎస్ డాలర్ ఇండెక్స్ 0.24 శాతం తగ్గి 98.88 వద్ద నిలిచింది. నిఫ్టీ పుట్ కాల్ రేషియో(PCR) 1.09 నుంచి 1.06కు తగ్గింది. విక్స్(VIX) 4.3 శాతం పెరిగి 18.02 వద్ద ఉంది. పీసీఆర్ తగ్గడం, విక్స్ పెరగడం బుల్స్‌కు ప్రతికూలం.
