Pre Market analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre Market analysis | ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ(GDP) వృద్ధి గణనీయంగా పెరిగింది. భారత్‌, యూఎస్‌ల మధ్య మొదటి విడత వాణిజ్య ఒప్పందం ఈ క్యాలెండర్‌ ఇయర్‌లోనే జరుగుతుందని మన దేశ వాణిజ్య కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. దీంతో మన మార్కెట్లు పాజిటివ్‌గా స్పందించే అవకాశాలున్నాయి. గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గత సెషన్‌లో యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు లాభపడగా.. సోమవారం ఉదయం ప్రధాన ఆసియా […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre Market analysis | ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ(GDP) వృద్ధి గణనీయంగా పెరిగింది.

భారత్‌, యూఎస్‌ల మధ్య మొదటి విడత వాణిజ్య ఒప్పందం ఈ క్యాలెండర్‌ ఇయర్‌లోనే జరుగుతుందని మన దేశ వాణిజ్య కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. దీంతో మన మార్కెట్లు పాజిటివ్‌గా స్పందించే అవకాశాలున్నాయి.

గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గత సెషన్‌లో యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు లాభపడగా.. సోమవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా కనిపిస్తున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) పాజిటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు మాత్రం గ్యాప్‌ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Pre Market analysis | యూఎస్‌ మార్కెట్లు (US markets)..

యూఎస్‌ ఫెడ్‌(US Fed) వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలతో గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్‌ లాభాలతో ముగిసింది. నాస్‌డాక్‌(Nasdaq) 0.65 శాతం, ఎస్‌అండ్‌పీ 0.54 శాతం పెరిగాయి. ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.34 శాతం నష్టంతో ఉంది.

Pre Market analysis | యూరోప్‌ మార్కెట్లు (European markets)..

డీఏఎక్స్‌(DAX) 0.29 శాతం, సీఏసీ 0.29 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.27 శాతం లాభపడ్డాయి.

Pre Market analysis | ఆసియా మార్కెట్లు (Asian markets)..

ప్రధాన ఆసియా మార్కెట్లు ఉదయం 8 గంటల సమయంలో మిక్స్‌డ్‌గా కనిపిస్తున్నాయి. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌(Hang Seng) 0.63 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్‌ టైమ్స్‌ 0.43 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.21 శాతం లాభాలతో ఉండగా.. జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 1.69 శాతం, తైవాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 0.21 శాతం, సౌత్‌ కొరియాకు చెందిన కోస్పీ 0.11 శాతం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ 0.45 శాతం లాభంతో కొనసాగుతోంది. దీంతో మన మార్కెట్లు గ్యాప్‌అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్‌ఐఐ(FII)లు నికరంగా రూ. 3,795 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. డీఐఐలు రూ. 4,148 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.16 నుంచి 1.14 కు పడిపోయింది. విక్స్‌(VIX) వరుసగా ఐదో సెషన్‌లో 1.42 శాతం తగ్గి 11.62 వద్ద ఉంది.
  • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 63.31 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు తగ్గి 89.45 వద్ద నిలిచింది.
  • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.04 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 99.44 వద్ద కొనసాగుతున్నాయి.
  • వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఉత్పత్తి పెంపును తాత్కాలికంగా నిలిపివేయాలని ఒపెక్‌(OPEC) నిర్ణయించింది. దీంతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇది మన ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలం.
  • జూలై -సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలకన్నా అధికంగా ఉంది. గతేడాది ఇదే సమయంలో 5.6 శాతం ఉన్న వృద్ధి రేటు ఈసారి 7.8 శాతంగా నమోదు కావడం గమనార్హం.
  • భారత్‌, యూఎస్‌ల మధ్య మొదటి విడత వాణిజ్య ఒప్పందం(Trade agreement) ఈ క్యాలెండర్‌ ఇయర్‌లోనే జరుగుతుందని మన దేశ వాణిజ్య కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు పాజిటివ్‌గా స్పందించే అవకాశాలున్నాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...