అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre Market Analysis | గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గత సెషన్‌లో యూఎస్(US), యూరోప్ మార్కెట్లు నష్టాలతో ముగియగా.. మంగళవారం ఉదయం షాంఘై మినహా ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) నెగెటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు మాత్రం గ్యాప్ డౌన్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు (US markets)..
యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుదల ప్రభావం యూఎస్ మార్కెట్లపై కనిపించింది. గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్(Wall street) నష్టాలతో ముగిసింది. ఎస్‌అండ్‌పీ 0.53 శాతం, నాస్‌డాక్(Nasdaq) 0.46 శాతం నష్టపోయాయి. ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.04 శాతం లాభంతో ఉంది.
Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు (European markets)..
డీఏఎక్స్(DAX) 1.05 శాతం, సీఏసీ 0.32 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.19 శాతం పడిపోయాయి.
Pre Market Analysis | ఆసియా మార్కెట్లు (Asian markets)..
ప్రధాన ఆసియా మార్కెట్లు ఉదయం 8 గంటల సమయంలో లాభాలతోగా కనిపిస్తున్నాయి. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 1.51 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.02 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(Hang Seng) 0.67 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.39 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.21 శాతం లాభాలతో ఉన్నాయి.
చైనాకు చెందిన షాంఘై 0.36 శాతం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.16 శాతం నష్టంతో కొనసాగుతోంది. దీంతో మన మార్కెట్లు గ్యాప్‌డౌన్(Gap down)లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 1,171 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. డీఐఐ(DII)లు రూ. 2,558 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.14 నుంచి 0.89 కు పడిపోయింది.
- విక్స్(VIX) 0.06 శాతం పెరిగి 11.63 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 63.16 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి 89.55 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.09 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్(Dollar index) 99.42 వద్ద కొనసాగుతున్నాయి.
- యూఎస్ మాన్యుఫాక్చరింగ్ పీఎంఐ(PMI) వరుసగా తొమ్మిదో నెలలోనూ కుదుపులకు గురయ్యింది. ఇన్‌స్టిట్యూట్ ఫర్ సప్లై మేనేజ్‌మెంట్ యొక్క తయారీ పీఎంఐ నవంబర్‌లో 48.2 కు పడిపోయింది. ఇది గతనెలలో 48.7గా ఉంది.
- భారత జీఎస్టీ వసూళ్లు(GST collections) పడిపోయాయి. అక్టోబర్‌లో రూ. 1.96 లక్షల కోట్ల జీఎస్టీ వసూలవగా.. నవంబర్‌లో ఇది రూ. 1.70 లక్షల కోట్లకు తగ్గింది. అయితే వార్షిక ప్రాతిపదికన 0.7 శాతం వృద్ధి నమోదయ్యింది.
