అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు(US markets) లాభాలతో ముగియగా.. యూరోప్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. చైనా, హాంగ్‌కాంగ్ మినహా మిగిలిన దేశాల స్టాక్ మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ స్వల్ప నష్టాలతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Pre Market Analysis | యూఎస్ మార్కెట్లు US markets..
యూఎస్ ఫెడ్(US Fed) వచ్చే వారంలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలతో యూఎస్ మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 0.60 శాతం, ఎస్‌అండ్‌పీ 0.23 శాతం పెరిగాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ సైతం 0.24 శాతం లాభంతో ఉంది.
Pre Market Analysis | యూరోప్ మార్కెట్లు European markets..
డీఏఎక్స్(DAX) 0.51 శాతం పెరగ్గా.. సీఏసీ 0.28 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.01 శాతం పడిపోయాయి.
Pre Market Analysis | ఆసియా మార్కెట్లు Asian markets..
ప్రధాన ఆసియా మార్కెట్లు(Asian markets) ఉదయం 8 గంటల సమయంలో లాభాలతోగా కనిపిస్తున్నాయి. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 1.27 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.08 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.58 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.35 శాతం లాభాలతో ఉండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(Hang Seng) 1.06 శాతం,
చైనాకు చెందిన షాంఘై 0.26 శాతం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.03 శాతం నష్టంతో కొనసాగుతోంది. మన మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 3,642 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐ(DII)లు రూ. 4,645 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.89 నుంచి 0.94 కు పెరిగింది.
- విక్స్(VIX) 3.42 శాతం తగ్గి 11.23 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 62.20 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 31 పైసలు తగ్గి 89.87 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.08 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్(Dollar index) 99.23 వద్ద కొనసాగుతున్నాయి.
- రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి చర్చలు నిర్మాణాత్మకంగా సాగుతున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.
- యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలతో గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్ లాభాలతో ముగిసింది.
- టెక్ స్టాక్స్ ఇండెక్స్‌లను ముందుకు నడిపించాయి. దీని ప్రభావం ఆసియా మార్కెట్లపైనా కనిపిస్తోంది.
- మూడు రోజులపాటు జరిగే ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.
- ఈ రోజు మెయిన్‌బోర్డ్‌కు చెందిన మూడు ఐపీవో(IPO)లు ప్రారంభం కానున్నాయి. మీషో, ఏక్వస్, విద్య వైర్స్ పబ్లిక్ ఇష్యూలు ఈరోజు ప్రారంభమై 5వ తేదీన ముగుస్తాయి.
