Homeబిజినెస్​Pre market analysis | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

Pre market analysis | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. ఫ్లాట్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

యూఎస్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిసింది. సోమవారం ఉదయం హాంగ్‌సెంగ్‌, గిఫ్ట్‌ నిఫ్టీ మినహా ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ నెగెటివ్‌ ఓపెనింగ్​ సూచిస్తుంది.

- Advertisement -

అక్షరటుడే, న్యూఢిల్లీ: యూఎస్‌ మార్కెట్లు(US markets) మిక్స్‌డ్‌గా ముగియగా.. యూరోప్‌ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది. సోమవారం ఉదయం హాంగ్‌సెంగ్‌, గిఫ్ట్‌ నిఫ్టీ(Gift nifty) మినహా ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో సాగుతున్నాయి. గిఫ్ట్‌ నిఫ్టీ నెగెటివ్‌గా ఉంది.

Pre market analysis | యూఎస్‌ మార్కెట్లు (US markets)..

ఎస్‌అండ్‌పీ 0.01 శాతం పెరగ్గా.. నాస్‌డాక్‌(Nasdaq) 0.28 శాతం నష్టపోయింది. సోమవారం ఉదయం డౌజోన్స్‌ ఫ్యూచర్స్‌ 0.20 శాతం లాభంతో సాగుతోంది.

Pre market analysis | యూరోప్‌ మార్కెట్లు (European markets)..

డీఏఎక్స్‌ 1.09 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.67 శాతం, సీఏసీ 0.31 శాతం లాభాలతో ముగిశాయి.

Pre market analysis | ఆసియా మార్కెట్లు (Asian markets)..

సోమవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు ఎక్కువగా లాభాలతో సాగుతున్నాయి. ఉదయం 8.10 గంటల సమయంలో జపాన్‌కు చెందిన నిక్కీ(Nikkei) 4.71 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.52 శాతం, సింగపూర్‌ ఎక్స్ఛేంజ్‌ స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ 0.07 శాతం లాభంతో కొనసాగుతుండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌(Hang Seng) 0.78 శాతం నష్టంతో ఉంది. గిఫ్ట్‌ నిఫ్టీ 0.04 శాతం నష్టంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌ టు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతున్నాయి. వరుసగా తొమ్మిదో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. నికరంగా రూ. 1,583 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయిచారు. డీఐఐ(DII)లు వరుసగా 28వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో రూ. 489 కోట్ల విలువైన స్టాక్స్‌ కొన్నారు.

  • నిఫ్టీ పుట్‌కాల్‌ రేషియో(PCR) 1.18 నుంచి 1.17 కు తగ్గింది. విక్స్‌(VIX) 2.21 శాతం తగ్గి 10.06 వద్ద ఉంది.
  • బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 65.44 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 7 పైస బలహీనపడి 88.77 వద్ద నిలిచింది.
  • యూఎస్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 4.15 శాతం వద్ద, డాలర్‌ ఇండెక్స్‌ 98 వద్ద కొనసాగుతున్నాయి.
  • ఈవారంలో యూఎస్‌ ప్రభుత్వ షట్‌డౌన్‌ పరిణామాలు, ఇజ్రాయిల్‌ హమాస్‌ మధ్య యుద్ధం విషయంలో అప్‌డేట్స్‌, యూఎస్‌ ఎఫ్‌వోఎంసీ తీర్మానాలు(US FOMC minutes) మార్కెట్‌ దిశను నిర్దేశించే అవకాశాలు ఉన్నాయి.
  • ఇజ్రాయిల్‌ హమాస్‌ మధ్య కాల్పుల విరమణ కోసం ఈరోజు ఈజిప్ట్‌లో పరోక్ష చర్చలు జరగనున్నాయి.
  • జపాన్‌ తదుపరి ప్రధానిగా తకైచిని ఎన్నికవడంతో నిక్కీలో జోష్‌ నెలకొంది. రికార్డు స్థాయి గరిష్టాలకు చేరింది.