అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre market analysis | గ్లోబల్ మార్కెట్లు(Global markets) మిక్స్‌డ్‌గా ఉన్నాయి. మన మార్కెట్లు మాత్రం ఫ్లాట్ టు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్(Wall street) స్వల్ప లాభాలతో ముగియగా యూరోప్ మార్కెట్లు మిశ్రమంగా స్పందించాయి. సోమవారం ఉదయం ప్రధాన ఆసియా స్టాక్ మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ(Gift nifty) నెగెటివ్‌గా ఉండడంతో మన మార్కెట్లు సైతం ఫ్లాట్ టు నెగెటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Pre market analysis | యూఎస్ మార్కెట్లు..
ఈవారంలో యూఎస్(US) ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై కీలక నిర్ణయం తీసుకోనుంది. దీంతో గత సెషన్‌లో వాల్‌స్ట్రీట్‌లో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 0.27 శాతం, ఎస్‌అండ్‌పీ 0.19 శాతం పెరిగాయి. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.02 శాతం నష్టంతో ఉంది.
Pre market analysis | యూరోప్ మార్కెట్లు..
డీఏఎక్స్(DAX) 0.81 శాతం లాభపడగా.. ఎఫ్‌టీఎస్‌ఈ 0.45 శాతం, సీఏసీ 0.09 శాతం నష్టపోయాయి.
Pre market analysis | ఆసియా మార్కెట్లు..
చైనా, జపాన్‌ల మధ్య సంబంధాలు క్షీణిస్తుండడంతో ఆసియా మార్కెట్(Asian markets)లలో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన ఆసియా మార్కెట్లు ఉదయం 8 గంటల సమయంలో మిక్స్‌డ్‌గా కనిపిస్తున్నాయి. తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.61 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.44 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.11 శాతం లాభాలతో ఉండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(Hang Seng) 0.48 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.24 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.06 శాతం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.06 శాతం నష్టంతో కొనసాగుతోంది. మన మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్‌ఐఐ(FII)లు నికరంగా రూ. 439 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐలు రూ. 4,189 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.93 నుంచి 1.22 కు పెరిగింది. విక్స్(VIX) 4.65 శాతం తగ్గి 10.32 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 63.74 డాలర్ల వద్ద ఉంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలతోపాటు రష్యా, వెనిజులాలనుంచి చమురు సరఫరాలపై ఆంక్షలు ఎదురయ్యే అవకాశాలు ఉండడంతో ముడి చమురు(Crude oil) ధరలు పెరుగుతున్నాయి. రెండువారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 89.98 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.14 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 98.91 వద్ద కొనసాగుతున్నాయి.
- భారత సీపీఐ ద్రవ్యోల్బణానికి(CPI inflation) సంబంధించిన డాటా ఈ వారంలో రానుంది. దీంతోపాటు యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం, విదేశీ పెట్టుబడులు ఈ వారంలో మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని అనలిస్టులు పేర్కొంటున్నారు.