అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre market analysis | యూఎస్, యూరోప్ మార్కెట్లు(Europe markets) లాభాలతో ముగియగా.. ప్రధాన ఆసియా స్టాక్ మార్కెట్లు మాత్రం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ(Gift nifty) ఫ్లాట్‌గా ఉండడంతో మన మార్కెట్లు సైతం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Pre market analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 0.13 శాతం, ఎస్‌అండ్‌పీ 0.11 శాతం పెరిగాయి. శుక్రవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ సైతం 0.08 శాతం లాభంతో ఉంది.
Pre market analysis | యూరోప్ మార్కెట్లు..
డీఏఎక్స్(DAX) 0.79 శాతం, సీఏసీ 0.43 శాతం, ఎఫ్‌టీఎస్‌ఈ 0.19 శాతం పెరిగాయి.
Pre market analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు ఉదయం 8 గంటల సమయంలో నష్టాలతో కనిపిస్తున్నాయి. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 0.66 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.05 శాతం లాభాలతో ఉండగా.. జపాన్‌కు చెందిన నిక్కీ 1.14 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(Hang Seng) 0.40 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.20 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.17 శాతం నష్టాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.01 శాతం నష్టంతో కొనసాగుతోంది. మన మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 1,944 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐ(DII)లు రూ. 3,661 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 0.85 నుంచి 0.93 కు పెరిగింది. విక్స్(VIX) 3.52 శాతం తగ్గి 10.82 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 63.15 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి(Rupee) మారకం విలువ 22 పైసలు బలపడి 89.98 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.09 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 99.01 వద్ద కొనసాగుతున్నాయి.
- ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్(RBI MPC Meeting) తీర్మానాలు ఈ రోజు వెలువడనున్నాయి. రెపోరేటును మార్చకుండా ఉంచుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో తీవ్ర ఒడుదుడుకులు ఎదురయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
- రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. ఈరోజు ప్రధాని మోదీ(Modi)తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ చర్చల ఫలితాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు.
