అక్షరటుడే, న్యూఢిల్లీ: Pre market analysis | యూఎస్, చైనా(China)ల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాల్‌స్ట్రీట్(Wallstreet) గత సెషన్‌లో నష్టాలతో ముగిసింది. ప్రధాన ఆసియా మార్కెట్లు మాత్రం లాభాలతో సాగుతున్నాయి.
యూఎస్ మార్కెట్లు(US markets) గత సెషన్‌లో అమ్మకాల ఒత్తిడికి గురవగా.. యూరోపియన్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. ఆసియా మార్కెట్లు మాత్రం పాజిటివ్‌గా సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ(Gift nifty) పాజిటివ్‌గా ఉంది.
Pre market analysis | యూఎస్ మార్కెట్లు (US markets)..
గత సెషన్‌లో నాస్‌డాక్(Nasdaq) 0.76 శాతం, ఎస్‌అండ్‌పీ 0.16 శాతం నష్టపోయాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.19 శాతం లాభంతో ఉంది.
ఎన్వీడియా(Nvidia) షేరు ధర 4.41 శాతం, హెచ్‌పీ స్టాక్ 4.35 శాతం, ఇంటెల్ 4.27 శాతం, అమెజాన్ 1.67 శాతం, టెస్లా 1.53 శాతం నష్టపోయాయి.
Pre market analysis | యూరోప్ మార్కెట్లు (European markets)..
డీఏఎక్స్(DAX) 0.62 శాతం, సీఏసీ 0.18 శాతం నష్టపోగా.. ఎఫ్‌టీఎస్‌ఈ 0.10 శాతం లాభాలతో ముగిసింది.
ఆసియా మార్కెట్లు (Asian markets)..
ప్రధాన ఆసియా మార్కెట్లు(Asian markets) బుధవారం ఉదయం 8 గంటల సమయంలో లాభాలతో సాగుతున్నాయి. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.81 శాతం లాభంతో ఉంది.
హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్(Hang Seng) 1.52 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.32 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.89 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.47 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి.
సింగపూర్ ఎక్స్ఛేంజ్ స్ట్రెయిట్స్ టైమ్స్ 0.28 శాతం లాభాలతో ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.35 శాతం నష్టంతో ఉంది. దీంతో మన మార్కెట్లు ఈరోజు గ్యాప్ అప్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్‌ఐఐలు వరుసగా రెండో సెషన్‌లో నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,508 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు. డీఐఐ(DII)లు వరుసగా 35వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉండి, రూ. 3,661 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో(PCR) 1.05 నుంచి 0.91 కు పడిపోయింది. విక్స్(VIX) 1.34 శాతం పెరిగి 11.16 కు చేరింది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 62.40 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు బలహీనపడి 88.79 వద్ద నిలిచింది.
- యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 0.42 శాతం తగ్గి 4.02 శాతం వద్ద, డాలర్ ఇండెక్స్ 0.18 శాతం తగ్గి 98.88 వద్ద కొనసాగుతున్నాయి.
- వడ్డీ రేట్ల కోత విషయంలో యూఎస్ ఫెడ్(US Fed) రిజర్వ్ చైర్మన్ పొవెల్ సానుకూలంగా స్పందించారు. యూఎస్ లేబర్ మార్కెట్ క్షీణిస్తుండడంతో పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఈనెలలో వడ్డీ రేట్ల కోతను ప్రకటించే అవకాశాలున్నాయి.
- యూఎస్, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సముద్ర షిప్పింగ్ సంస్థలపై ఇరు దేశాలు అదనపు పోర్ట్ ఫీజులు వసూలు చేయడం ప్రారంభించాయి.
- అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఫైనాన్షియల్ ఇయర్ 2026 కోసం భారత జీడీపీ(GDP) వృద్ధి అంచనాను 6.4 శాతం నుంచి 6.6 శాతానికి పెంచింది. ఇదే సమయంలో ప్రపంచ వృద్ధి 3.2 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్(IMF) అంచనా వేసింది.