Bheemgal BRS | ఇసుక దందాలో కవితలాగా ప్రశాంత్​రెడ్డి దోచుకోలేదు.. బీఆర్​ఎస్​ నాయకులు

అక్షరటుడే, ఇందూరు : Bheemgal BRS | జిల్లాల్లో ఏళ్లుగా సాగిన ఇసుక దందాలో కల్వకుంట్ల కవిత రూ.వేల కోట్లు దోచుకున్నారని.. కానీ ప్రశాంత్​రెడ్డి ఎలాంటి అవినీతి జోలికి వెళ్లలేదని బీఆర్​ఎస్​ నాయకులు అన్నారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని ప్రెస్​క్లబ్​లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కవిత (Kalvakuntla Kavitha) బీఆర్​ఎస్​లో ఉన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి మంచోడు.. ఇప్పుడు మీరు పార్టీ బయటకు వెళ్లారు కాబట్టి చెడ్డోడు అయ్యాడా అని ప్రశ్నించారు. తెలంగాణ […]

అక్షరటుడే, ఇందూరు : Bheemgal BRS | జిల్లాల్లో ఏళ్లుగా సాగిన ఇసుక దందాలో కల్వకుంట్ల కవిత రూ.వేల కోట్లు దోచుకున్నారని.. కానీ ప్రశాంత్​రెడ్డి ఎలాంటి అవినీతి జోలికి వెళ్లలేదని బీఆర్​ఎస్​ నాయకులు అన్నారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని ప్రెస్​క్లబ్​లో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కవిత (Kalvakuntla Kavitha) బీఆర్​ఎస్​లో ఉన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి మంచోడు.. ఇప్పుడు మీరు పార్టీ బయటకు వెళ్లారు కాబట్టి చెడ్డోడు అయ్యాడా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ప్రశాంత్​రెడ్డి (Prashanth Reddy) ఉన్నారని.. కానీ కవిత ఆ సమయంలో అమెరికాలో ఉన్నారన్నారు. ఉద్యమానికి, బీఆర్ఎస్​ పార్టీకి, తెలంగాణ జాగృతికి సైతం ఆర్థికసాయం చేసిన వ్యక్తి ప్రశాంత్​రెడ్డి అని బీఆర్​ఎస్​ నాయకులు పేర్కొన్నారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు బోధన్, బాన్సు​వాడలోని మంజీర నది ఇసుక దందాలో రూ.కోట్లు దండుకోలేదా వారు ప్రశ్నించారు. ప్రశాంత్​రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే కవితకు ఇసుకు మామూళ్లు ఇచ్చిన వారి పేర్లు మొత్తం బయటపెడతామని వారు హెచ్చరించారు. హైదరాబాద్​లో (Hyderabad) గుట్కా వ్యాపారుల వద్ద సైతం డబ్బులు వసూలు చేసిన చరిత్ర కవితదని వారు పేర్కొన్నారు.

పూటకో అవినీతి పని చేస్తున్న కాంగ్రెస్​ సీఎం రేవంత్​రెడ్డిని (CM Revanth Reddy) వదిలేసి ప్రశాంత్​రెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టి అక్కడి నీళ్లను నిజామాబాద్ జిల్లా (Nizamabad District) ఎస్సారెస్పీలోకి, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్​లోకి తీసుకొచ్చింది కేసీఆరే కదా అని వారన్నారు. అటువంటి కేసీఆర్​ను ఆయన బిడ్డవై ఉండి కేసీఆర్ నీళ్లు తేలేదంటే ప్రశాంత్​రెడ్డి ఎలా ఊరుకుంటాడని వారు ప్రశ్నించారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, పార్టీ భీమ్​గల్​, మోర్తాడ్, కమ్మర్​పల్లి, వేల్పూర్, ముప్కాల్, ఏర్గట్ల మండలాల అధ్యక్షులు దొనకంటి నర్సయ్య, రేగుంట దేవేందర్, కల్లెడ ఏలియా, నాగాధర్ రెడ్డి, పూర్ణన్నాథం, నర్సారెడ్డి, మైలారం సుధాకర్, గంగారెడ్డి, రాజేశ్వర్, మొయిజ్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...