అక్షరటుడే, వెబ్‌డెస్క్: Actress Pragathi | సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన నటి ప్రగతి (Actress Pragathi) మరో రంగంలోనూ తన ప్రతిభను రుజువు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
‘బాద్‌షా’, ‘రేసుగుర్రం’ (Race Gurram), ‘ఇద్దరమ్మాయిలతో’ వంటి చిత్రాల్లో ప్రభావవంతమైన పాత్రలు పోషించిన ప్రగతి, ఇటీవలి కాలంలో పవర్ వెయిట్‌లిఫ్టింగ్‌లో వరుస పతకాలు సాధిస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పలు పతకాలు, అవార్డులు గెలుచుకున్న ఆమె ఇప్పుడు అంతర్జాతీయస్థాయికి ఎదిగింది. ప్రస్తుతం టర్కీలో జరిగిన ఏషియన్ గేమ్స్ పవర్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో (Asian Games powerlifting event) భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించిన ప్రగతి, అద్భుత ప్రదర్శనతో రెండో స్థానాన్ని సాధించి సిల్వర్ మెడల్ గెలుచుకుంది.
Actress Pragathi | మేడమ్ సర్..
అంతకుముందు సౌత్ ఇండియన్ ఛాంపియన్‌షిప్ 2024లో సిల్వర్ మెడల్ దక్కించుకున్న ఆమె, ఈ ఏడాది కేరళలో జరిగిన నేషనల్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2025లో (National Powerlifting Championship 2025) గోల్డ్ మెడల్ కొట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దాదాపు 50 ఏళ్ల వయసులో ఈ స్థాయి ఫిట్‌నెస్‌ను నిలబెట్టి, దేశానికి ప్రాతినిధ్యం వహించడం నిజంగా ప్రేరణాత్మకం. చిన్నతనం నుంచే హీరోయిన్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రగతి, వ్యక్తిగత జీవితం కారణంగా సినిమా కెరీర్‌కు దూరమైంది. చిన్న వయసులోనే ప్రేమ పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత వచ్చిన బాధలు, ఆర్థిక ఇబ్బందులు .. ఇవన్నీ కలిసి ఆమెను కాస్త వెనక్కి నెట్టాయి. కానీ ఆ తర్వాత ధైర్యంగా మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి మొదట సీరియల్స్, ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటింది.
ఇప్పటి వరకు దాదాపు 200కి పైగా చిత్రాల్లో తల్లి, వదిన, అక్కలాంటి Sister పాత్రల్లో మెప్పించిన ఆమె, సోషల్ మీడియాలో గ్లామరస్ లుక్స్‌తో కూడా ఎప్పుడూ అభిమానుల దృష్టిలో ఉంటుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రగతి తన జీవిత కష్టాలను పంచుకుంది. చిన్నతనంలోనే ఆత్మగౌరవం ఎక్కువగా ఉండడంతో ఎప్పుడూ కష్టపడి సంపాదించడం అలవాటని, పాకెట్ మనీ కోసం ఎస్టీడీ బూత్, పిజ్జా హట్ వంటి స్టోర్లలో పని చేసిన విషయాలు వెల్లడించింది.
ఇప్పుడు వెయిట్‌లిఫ్టింగ్‌లో దేశానికి మెడల్ తెచ్చిపెట్టిన ప్రగతి, మరోసారి తన జీవితాన్ని కొత్త దిశలో నిలిపినట్టైంది. ఆమె ఫిట్‌నెస్, డెడికేషన్, మానసిక ధైర్యం ఎంతోమందికి ఆదర్శంగా మారాయి. సినీ వర్గాలు, అభిమానులు ఆమె విజయాన్ని ప్రశంసిస్తుండగా, నెటిజన్లు “ప్రగతి బయోపిక్ తీసినా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది” అని కామెంట్లు చేస్తున్నారు. సరైన దర్శకుడి చేతిలో పడితే ఆమె ప్రయాణం వెండితెరపై మరింత గొప్పగా కనిపించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
