అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hero Prabhas | ‘రాజాసాబ్’ (Raja Saab)లో ప్రభాస్ కొత్త లుక్‌లో కనిపించగా, ఆయన మళ్లీ పాత స్టైల్‌లోకి వచ్చేశాడని మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో కన్‌ఫాం అయింది. ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి 2’ సినిమాల కోసం పెద్దగా లుక్ మార్పులు అవసరం లేకపోవడం వల్లే ఒకేసారి మూడు ప్రాజెక్ట్‌లను బ్యాలెన్స్ చేయగలుగుతున్నాడన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఒకేసారి రెండు, మూడు సినిమాలను సమాంతరంగా నడిపించడం ప్రభాస్‌కు కొత్తేమీ కాదు. భారీ బడ్జెట్ చిత్రాలు అయినప్పటికీ షెడ్యూల్ మేనేజ్‌మెంట్‌లో డార్లింగ్ స్పీడ్ చూపిస్తుంటాడు. గత ఏడాది ప్రభాస్ ‘రాజాసాబ్’ , ‘పౌజీ’ షూటింగ్‌లతో బిజీగా గడిపాడు. ఎన్నో ఆలస్యాలు, అవాంతరాల తర్వాత ‘రాజాసాబ్’ ఎట్టకేలకు జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా, ప్రభాస్ అవేమి పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న కీలక ప్రాజెక్ట్‌లలో ‘ఫౌజీ’ ఒకటి. భారీ పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తైంది. ‘రాజాసాబ్’ పనులు చివరి దశకు చేరుకునే సమయంలోనే ప్రభాస్ ప్రత్యేకంగా సమయం కేటాయించి ‘ఫౌజీ’ షూటింగ్‌లో పాల్గొనడం గమనార్హం. ఈ సినిమా కోసం అవసరమైన ముఖ్యమైన భాగాలు త్వరగా పూర్తిచేయాలన్నది మేకర్స్ ప్లాన్‌గా తెలుస్తోంది.
Hero Prabhas | కల్కి2 మొదలు పెట్టబోతున్నారా?
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ (Spirit) ప్రాజెక్ట్‌పై కూడా ప్రభాస్ ఫోకస్ పెరిగింది. ‘రాజాసాబ్’ ప్రమోషన్స్ ముగిసిన వెంటనే ప్రభాస్ కొద్దిరోజులు విదేశాల్లో విహారయాత్రకు వెళ్లాడు. మరో రెండు మూడు రోజుల్లో ఆయన తిరిగి ఇండియాకు రానున్నట్లు సమాచారం. సంక్రాంతి సెలవుల (Sankranti Holidays) తర్వాత ‘స్పిరిట్’ షూటింగ్‌ను పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు టీమ్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ అవసరం లేని సన్నివేశాలను సందీప్ రెడ్డి చిత్రీకరిస్తున్నాడట. ఈ నేపథ్యంలోనే ‘కల్కి 2’ గురించి కూడా ఆసక్తికర అప్‌డేట్ బయటకు వస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ షూటింగ్‌ను ఫిబ్రవరి చివరలో లేదా మార్చి తొలి వారంలో ప్రారంభించాలని యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ వెంటనే జాయిన్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. మరో రెండు నుంచి మూడు నెలల తర్వాతే ప్రభాస్ ‘కల్కి 2’ షూటింగ్‌లో పాల్గొననున్నాడట. అందువల్ల మొదటి దశలో ప్రభాస్ లేకుండానే కీలక సన్నివేశాలను పూర్తి చేయాలన్నది నాగ్ అశ్విన్ ప్లాన్‌గా కనిపిస్తోంది. ఇక ‘స్పిరిట్’ విషయంలో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) వేగంగా ముందుకెళ్లాలని భావిస్తున్నాడట. కేవలం 90 నుంచి 120 రోజుల్లోనే మొత్తం షూటింగ్ పూర్తి చేయాలన్న టార్గెట్‌తో షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే ‘కల్కి 2’ పనులను కూడా సమాంతరంగా మొదలుపెట్టాలని నాగ్ అశ్విన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.