అక్షరటుడే, ఇందూరు: Power Cut | నిజామాబాద్ నగరంలోని గూపన్పల్లి (Goopanpally) సబ్స్టేషన్ పరిధిలో మంగళవారం విద్యుత్ సరఫరాలో (Electricity supply) అంతరాయం ఉంటుందని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని సూచించారు. గూపన్పల్లి, గంగాస్థాన్ ఫేజ్–2 (Gangasthan Phase-2,), ఫేజ్–3, పృథ్వీ అపార్ట్మెంట్ ప్రాంతాల్లో కరెంట్ ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
