Homeజిల్లాలునిజామాబాద్​Power Generation Center | జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి

Power Generation Center | జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి

ఎస్సారెస్పీ వద్ద తెలంగాణ విద్యుత్​ ఉత్పత్తి కేంద్రంలో నిరాటంకంగా జల విద్యుత్​ ఉత్పత్తి జరుగుతోంది. ఎస్కేప్​ గేట్ల ద్వారా విడుదలవుతున్న నీటితో విద్యుత్​ ఉత్పత్తి జరుగుతోందని డీఈ శ్రీనివాస్​ పేర్కొన్నారు.

- Advertisement -

అక్షరటుడే మెండోరా : Power Generation Center | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sri Ramsagar Project) వద్ద ఉన్న తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నిరంతరాయంగా కరెంట్​ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్ట్ నుంచి ప్రధాన కాలువైన ఎస్కేప్ గేట్ల ద్వారా 8000 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతోంది.

ఈ నీటితో నాలుగు టర్బయిన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి (Power Generation) చేస్తున్నామని డీఈ శ్రీనివాస్ తెలిపారు. నాలుగు టర్బయిన్ల ద్వారా 36.42 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఆయన వివరించారు. ఒక్క రోజులో 0.8734 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. ఈ నెలలో 8.6762 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందని ఈ ఆర్థిక సంవత్సరంలో 49.6118 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి జరిగిందని వారు తెలిపారు. అయితే శనివారం సాయంత్రానికి కాకతీయ కాలువ ద్వారా 5వేల క్యూసెక్కులు, ఎస్కేప్​ గేట్ల ద్వారా 3వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.