Homeతాజావార్తలుPonguleti son Raghava | గచ్చిబౌలిలో పొంగులేటి కొడుకు రాఘవ కంపెనీపై కేసు నమోదు

Ponguleti son Raghava | గచ్చిబౌలిలో పొంగులేటి కొడుకు రాఘవ కంపెనీపై కేసు నమోదు

హైదరాబాద్​లో భూకబ్జాకు యత్నించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పుత్రరత్నంపై కేసు నమోదైంది. 

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Ponguleti son Raghava | భూకబ్జాకు యత్నించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కుమారుడి కంపెనీపై కేసు నమోదైంది. గచ్చిబౌలిలో 300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు పొంగులేటి కొడుకు రాఘవ యత్నించారు. అడ్డుకున్న భూ యజమానిపై పొక్లెయిన్​తో దాడి చేశారు.

గత నాలుగు రోజులుగా ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు బయటకు పొక్కనీయలేదు. గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని వట్టి నాగులపల్లిలో భూ కబ్జాకు యత్నించారు రాఘవ.

Ponguleti son Raghava | బౌన్సర్లతో దాడి..

70 మందికి పైగా బౌన్సర్లతో వెళ్లి భూమి చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేశారు. అడ్డుకున్న అడ్డుకున్న స్థలం యజమానిపై దాడికి దిగారు.

పల్లవి షా అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అక్కడ ఉన్న గోషాలను సైతం ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆదివారం (నవంబరు 30) అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు పొంగులేటికి చెందిన రాఘవ కన్​స్ట్రక్షన్​తోపాటు మరో ఐదుగురుపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

Must Read
Related News