HomeజాతీయంPollution Control day | మన చుట్టే విచ్చుకున్న కాలుష్య కోరలు.. తెలుసుకోకుంటే ప్రమాదమే..!

Pollution Control day | మన చుట్టే విచ్చుకున్న కాలుష్య కోరలు.. తెలుసుకోకుంటే ప్రమాదమే..!

Pollution Control day | ఏటా డిసెంబర్ 2వ తేదీన జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pollution Control day | ఏటా డిసెంబర్ 2వ తేదీన, భారతదేశంలో జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు.

ఇది కేవలం ఒక దినోత్సవం మాత్రమే కాదు, దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన పారిశ్రామిక విపత్తులలో ఒకటైన భోపాల్ గ్యాస్ దుర్ఘటన (1984)లో ప్రాణాలు కోల్పోయిన వేలాది అమాయక జీవితాలను స్మరించుకునే రోజు.

ఆ విషాదం నుంచి మనం నేర్చుకున్న పాఠాలు, పారిశ్రామిక భద్రత, పర్యావరణ పరిరక్షణపై మన బాధ్యతను బలోపేతం చేసుకోవడమే ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యం.

కాలుష్యం: Pollution Control day | మనం సృష్టిస్తున్న ప్రపంచ సమస్య కాలుష్యం (వాయు, జల, నేల, శబ్దం) పర్యావరణ వ్యవస్థను చాలా కాలంగా దెబ్బతీస్తోంది.

క్రాకర్లు, పరిశ్రమల లీకేజీలు, పేలుళ్లు, నిత్యం పెరుగుతున్న వాహనాలు, కర్మాగారాల నుంచి వెలువడే ప్రమాదకర వాయువులైన ఓజోన్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాలు గాలి నాణ్యతను రోజురోజుకూ దిగజారుస్తున్నాయి.

ఈ పెరుగుతున్న కాలుష్యం ప్రజల జీవన నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. స్వచ్ఛమైన గాలి పీల్చే హక్కు, స్వచ్ఛమైన నీరు తాగే హక్కును మనం మన నిర్లక్ష్యంతోనే కోల్పోతున్నాం.

పెరుగుతున్న ముప్పులు: Pollution Control day | మన నిర్లక్ష్యమే కారణమా? మనకు తెలియకుండానే మనం ప్రకృతిలో కొత్త సమస్యలను పెంచి పోషిస్తున్నాం. పంటలు పండించిన తర్వాత మిగిలిన వ్యర్థాలను తగలబెట్టడం ద్వారా గాలి కాలుష్యాన్ని మనమే పెంచుతున్నాం.

విపరీతమైన ప్లాస్టిక్ వాడకం, నీటిని వృథా చేయడం, మురుగును రోడ్ల మీదకు వదిలేయడం వంటి చర్యలు పర్యావరణాన్ని దెబ్బతీసి, చివరికి మన ఆరోగ్యాన్నే హరిస్తున్నాయి.

పావురాల సంతతి, శ్వాసకోశ సమస్యలు: నగరాల్లో పావురాల సంఖ్య గణనీయంగా పెరగడం మరో తెలియని ముప్పు. వాటి వ్యర్థాలు, ఈకల నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లు ఊపిరితిత్తుల సమస్యలకు కారణమవుతున్నాయి.

వైద్యుల హెచ్చరిక: పావురాల వ్యర్థాల వల్ల చర్మం, నోరు, ముఖ్యంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, ఉదరకోశం దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

విపరీతంగా పెరిగిపోతున్న పావురాల సంతతిని కట్టడి చేయాలనే డిమాండ్ నగరాల్లో బలంగా వినిపిస్తోంది. ఇది తెలియకుండానే మనం ఎదుర్కొంటున్న మరో ఆరోగ్య ముప్పు.

ప్రాణాలను హరించే చెట్లు: ప్రమాదకరమైన వృక్షాలు ప్రాణవాయువునిచ్చే చెట్లలో కొన్ని ప్రాణాలను హరించేవిగా కూడా ఉంటాయనే విషయం చాలామందికి తెలియదు. దారుల పక్కన పెరుగుతున్న ఇలాంటి విషపూరిత వృక్షాలను మనం గుర్తించలేకపోతున్నాం.

మంచినీల్ చెట్టు: ఇది అచ్చం యాపిల్ చెట్టును పోలి ఉంటుంది. దీని నుంచి కారే పాల లాంటి ద్రవం చర్మానికి తాకితే మంట, నొప్పి, దద్దుర్లు వస్తాయి. కళ్లలో పడితే చూపు పోయే ప్రమాదం ఉంది. పండు తింటే ప్రాణాలకు ముప్పు.

ఏడాకుల చెట్టు (డెవిల్ ట్రీ): ఇది సొగసైన సతతహరిత వృక్షం, దీనిని పాఠశాల పలకల తయారీలో ఉపయోగించేవారు. అక్టోబరులో పూసే దీని పూలు సువాసన కలిగి ఉన్నప్పటికీ, ఈ చెట్టు అన్ని భాగాలు విషపూరితమైనవి. తెలియని చిన్న చిన్న నిర్లక్ష్యాలకు భారీ మూల్యాన్ని మనమే చెల్లించుకోవలసి వస్తుంది.

పాటించవలసిన చిట్కాలు: ప్రతి పౌరుడు ఈ కింది చిట్కాలను పాటించడం ద్వారా కాలుష్య నియంత్రణలో భాగం కావొచ్చు.

గృహ కాలుష్యం అదుపు: శుభ్రపరిచే (Cleaning) ఉత్పత్తులలో ఉండే అస్థిర సేంద్రియ సమ్మేళనాలు (VOCలు) గాలిలోని ఓజోన్‌తో చర్య జరిపి ఫార్మాల్డిహైడ్‌ను ఏర్పరుస్తాయి. సహజ శుభ్రపరిచే ఉత్పత్తులను వాడండి.

వంటగదిలో వెంటిలేషన్: గ్యాస్ స్టవ్‌లపై ఆహార పదార్థాలను వేయించడం వల్ల నైట్రోజన్ డయాక్సైడ్ (NO2) వాయు కాలుష్య కారకాలు విడుదలవుతాయి. వంట చేసేటప్పుడు తగిన వెంటిలేషన్‌ను (ఎగ్జాస్ట్ ఫ్యాన్) తప్పనిసరిగా వాడాలి.

ఇంటిన శుభ్రత: దుమ్ము, తివాచీలు, పెంపుడు జంతువుల జుట్టు నుంచి ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచండి.

ప్లాస్టిక్ వద్దు: ప్లాస్టిక్ పదార్థాలను ఉపయోగించడం మానేయండి. వాటికి ప్రత్యామ్నాయంగా కాగితం సంచులు లేదా వస్త్ర సంచులను వాడండి.

మొక్కల పెంపకం: పీస్ లిల్లీ, గెర్బెరా డైసీ, ఇంగ్లీష్ ఐవీ వంటి మొక్కలను పెంచుకోవడం ద్వారా ఇవి గాలి నుంచి కార్బన్ మోనాక్సైడ్‌ను తొలగించడంలో సహాయపడతాయి.

చెత్తను ఎల్లప్పుడూ డస్ట్‌బిన్‌లోనే వేయండి. రోడ్లపై వేయకుండా నీటిని వృథా చేయకుండా జాగ్రత్త పడండి.

Must Read
Related News