అక్షరటుడే, ఇందూరు: Municipal Elections | నిజామాబాద్ అర్బన్‌లో (Nizamabad Urban) ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్లను పెంచినట్లు మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ (Municipal Commissioner Dileep Kumar) పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు.
Municipal Elections | ఎన్నికల నిబంధనల ప్రకారం..
ఎన్నికల కమిషన్ (Election Commission) నియమనిబంధనల ప్రకారం.. పోలింగ్స్టేషన్ల సంఖ్యను పెంచినట్లు పేర్కొన్నారు. ప్రతి బూత్‌లో 750 నుంచి 770 వరకు ఓటర్లు ఉండేలా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే కేంద్రాలను పెంచినట్లు పేర్కొన్నారు. సమావేశంలో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, తుది నివేదికను త్వరలో విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ రవీంద్ర సాగర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.