అక్షరటుడే, గాంధారి: Gandhari | గాంధారి మండలంలో (Gandhari mandal) సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తూర్పు రాజశ్రీ రాజు సర్పంచ్ బరిలో నిలవడంతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ (MLA Madan Mohan) చొరవ తీసుకున్నారు. పార్టీ ఆకుల కల్పన శేఖర్‌కు మద్దతు ఇస్తుండడంతో.. ఎమ్మెల్యే సూచన మేరకు తూర్పు రాజశ్రీ రాజు బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ (Congress Party) మద్దతు ఇస్తున్న అభ్యర్థి ఆకుల కల్పన శేఖర్‌ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అయితే పార్టీ సీనియర్ నేతగా, మండల అధ్యక్షుడిగా అందరిలో కలిసిపోయే నాయకుడిగా పేరొందిన తూర్పు రాజు సర్పంచ్ బరి నుండి తప్పుకోవడం కొంతమంది కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేజర్ గ్రామపంచాయతీగా పేరొందిన గాంధారిలో స్వయాన ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో రాజకీయం హీటెక్కింది.
