Hyderabad | నిందితుడి ఇంట్లో రోలెక్స్​ వాచ్​ కొట్టేసిన పోలీసులు!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | పలువురు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు డిపార్ట్​మెంట్​కు మచ్చ తెస్తోంది. ఇటీవల నగరంలో ఓ ఎస్సై తన తుపాకీని తాకట్టు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో అధికారి ఏకంగా నిందితుడి ఇంట్లో రోలెక్స్​ వాచ్​ (Rolex Watch) కొట్టేసినట్లు సమాచారం. హైదరాబాద్​ నగరంలో ఇటీవల నకిలీ ఐపీఎస్​ అధికారి (Fake IPS Officer)గా చలామణి అవుతున్న శశికాంత్​ను ఫిల్మ్​నగర్​ పోలీసులు (Filmnagar Police) అరెస్ట్​ చేశారు. శశికాంత్​ బిల్డర్లను బెదిరించి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | పలువురు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు డిపార్ట్​మెంట్​కు మచ్చ తెస్తోంది. ఇటీవల నగరంలో ఓ ఎస్సై తన తుపాకీని తాకట్టు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో అధికారి ఏకంగా నిందితుడి ఇంట్లో రోలెక్స్​ వాచ్​ (Rolex Watch) కొట్టేసినట్లు సమాచారం.

హైదరాబాద్​ నగరంలో ఇటీవల నకిలీ ఐపీఎస్​ అధికారి (Fake IPS Officer)గా చలామణి అవుతున్న శశికాంత్​ను ఫిల్మ్​నగర్​ పోలీసులు (Filmnagar Police) అరెస్ట్​ చేశారు. శశికాంత్​ బిల్డర్లను బెదిరించి వసూళ్లకు పాల్పడుతుండటంతో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడు నివసిస్తున్న షేక్​పేటలోని అపర్ణ ఔరా అపార్ట్​మెంట్లో (Aparna Aura Apartment) సోదాలు చేపట్టారు. సాక్షుల సమక్షంలో, వీడియోగ్రఫీ మధ్య పలు వస్తువులను సీజ్​ చేశారు. అయితే అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్​ శశికాంత్​ (Constable Shashikant) ఇంట్లో ఉన్న రోలెక్స్​ వాచ్​ను మెల్లిగా జేబులో పెట్టుకున్నాడు. దీనిని గమనించిన మరో కానిస్టేబుల్​ ఇంకో వస్తువు కాజేశాడు.

Hyderabad | పోలీసులా.. దొంగలా..

నిందితుడి ఇంట్లో తనిఖీల సమయంలో పోలీసులు వస్తువులు కాజేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వాళ్లు పోలీసులా.. దొంగలా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు కాజేసిన వస్తువులను పంచుకునే క్రమంలో తేడాలు రావడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో అధికారులు విచారణ చేపట్టారు. రోలెక్స్​ వాచ్​తో పాటు మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా ఆ రోలెక్స్​ వాచ్​ ధర రూ.25 లక్షల వరకు ఉంటుందని అంచనా. నిందితుడి ఇంట్లో వస్తువులు కాజేసిన కానిస్టేబుళ్లపై అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...