అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తాడ్వాయి మండలంలోని (Tadwai mandal) ఓ గ్రామంలో పెళ్లి కాని యువతి గర్భం దాల్చగా అబార్షన్ చేసిన ఘటన ‘అక్షరటుడే’ కథనంతో వెలుగులోకి వచ్చింది.
దీనిపై వైద్యాధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఘటన ‘అక్షరటుడే’ ద్వారా వెలుగులోకి వచ్చాక పోలీసులు పోక్సో కేసు (POCSO case) నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా అబార్షన్ ఘటనపై ఎల్లారెడ్డి డీఎస్పీ విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అబార్షన్ ఎక్కడ చేశారు.. ఎవరు చేశారని ఆరా తీస్తున్నట్లుగా సమాచారం.
Kamareddy | ఆస్పత్రి పేరుపై తికమక..
అయితే యువతికి అబార్షన్ చేసిన ఆస్పత్రిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఓ ప్రైవేట్ వైద్యుడు (private doctor) రూ.70 వేలకు ఒప్పందం కుదుర్చుకుని అబార్షన్ చేసినట్లు విచారణలో తేలినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ వైద్యుడు ఎవరు.. ఆ ఆస్పత్రి ఏది అనేది బాధిత కుటుంబీకులు విచారణకు వెళ్లిన వైద్యాధికారులకు చెప్పడం లేదని తెలుస్తోంది.
అయితే సదరు ఆస్పత్రి వైద్యుడే పేరు బయటకు రాకుండా బాధితులను వేడుకున్నట్లుగా సమాచారం. దాంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆస్పత్రి, వైద్యుడి పేరు చెప్పడం లేదని తెలుస్తోంది. అయితే అబార్షన్ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణలో పోలీసులు ఆస్పత్రి పేరు తెలుసుకుంటారా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Kamareddy | గైనకాలజిస్టులతో సమావేశం..
మరోవైపు అబార్షన్ ఘటన వెలుగులోకి రావడంతో వైద్య ఆరోగ్యశాఖ (medical and health department) అప్రమత్తమైంది. వైద్యవృత్తికి మచ్చతెచ్చేలా కొందరు గైనకాలజిస్ట్లు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్లు చేస్తున్నట్లుగా గుర్తించారు. జిల్లాలో 23 మంది గైనకాలజిస్ట్లు ఉన్నారని, అత్యవసర సమయంలో ఇలా అబార్షన్లు చేసేందుకు ఇద్దరు, ముగ్గురు గైనకాలజిస్ట్లు అనుమతి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అబార్షన్ ఘటనలపై గైనకాలజిస్ట్లతో డీఎంహెచ్వో సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. రేపో, ఎల్లుండో సమావేశమై గైనకాలజిస్ట్లకు స్పష్టమైన నిబంధనలు వెల్లడించనున్నట్టుగా సమాచారం.
