అక్షరటుడే, ఎల్లారెడ్డి: Police constable attacked కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పరిధిలో పోలీస్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఎల్లారెడ్డిలోని ఇనాంధార్ గల్లిలో నివసించే రేష్మ సోమవారం రాత్రి సుమారు 9:40 గంటల సమయంలో డయల్ 100 కు ఫోన్ చేశారు. తన భర్త నజీమ్ తరచుగా మద్యం తాగొచ్చి వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న వెంటనే పెట్రోల్ కార్ సిబ్బందిలోని కానిస్టేబుల్ K. సాయికిరణ్ ఘటనాస్థలానికి చేరుకొని, నజీమ్‌ను సముదాయించేందుకు ప్రయత్నించారు.
Police constable attacked : కత్తితో దాడికి..
అయితే, నజీమ్ ఆగ్రహంతో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, ఇంట్లో ఉన్న కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు.
అప్రమత్తమైన కానిస్టేబుల్ దాడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎల్లారెడ్డి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించారు.
విధుల్లో ఉన్న పోలీసులపై ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా, దాడికి యత్నించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డి పోలీసులు హెచ్చరించారు.
