అక్షరటుడే, ఆర్మూర్: Armoor | పట్టణంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ (SHO Satyanarayana Goud) ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌తో (RTC bus stand) పాటు పలు టీ స్టాళ్లలో పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాలు, గంజాయి రవాణా, వినియోగం నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు కావొద్దని, తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్‌హెచ్‌వో ఈ సందర్భంగా సూచించారు.
