Homeజిల్లాలుకామారెడ్డిLocal Body Elections | నాగిరెడ్డిపేట్​లో జోరుగా పోలీసుల తనిఖీలు

Local Body Elections | నాగిరెడ్డిపేట్​లో జోరుగా పోలీసుల తనిఖీలు

నాగిరెడ్డిపేటలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఉత్సాహంగా సాగుతోంది. ముందస్తు చర్యల్లో భాగంగా ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Local Body Elections | నాగిరెడ్డిపేట మండలంలో పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) నామినేషన్ల పర్వం ఉత్సాహంగా సాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి అక్రమాలు, డబ్బు ప్రలోభాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభుత్వ అధికారులు, పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

Local Body Elections | ఉదయం నుంచే రంగంలోకి..

ఉదయం నుంచే మండల కేంద్రానికి వచ్చే ప్రతి వాహనాన్ని ఆపి పోలీసుబృందాలు తనిఖీ చేస్తున్నాయి. ఎన్నికల నియమాలు అమల్లో ఉన్నందున రూ.50 వేలకు మించి నగదును వెంట తీసుకెళ్లకూడదని మండల రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ మహమ్మద్ (Inspector Mohammed) ప్రజలకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. భారీ మొత్తంలో నగదు తీసుకువస్తూ పట్టుబడితే నిబంధనల ప్రకారం వెంటనే సీజ్ చేసి, కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఎన్నికల సమయంలో అనుమానాస్పదంగా తిరిగే వాహనాలు, వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టామని అధికారులు తెలిపారు. తనిఖీల్లో పోలీస్ సిబ్బంది, రెవెన్యూశాఖ (Revenue Department) సిబ్బంది సంయుక్తంగా పాల్గొని వాహనాల డాక్యుమెంట్లు, వ్యక్తిగత సామగ్రి, నగదు తదితరాలను పరిశీలించారు. ప్రజలు ఎలాంటి తప్పిదాలకు పాల్పడకుండా ఎన్నికల నియమాలను పూర్తిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మండలంలో శాంతియుతంగా, న్యాయంగా ఎన్నికలు జరగడానికి ఈ తనిఖీలు ఎనలేని సహకారం అందిస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Must Read
Related News